హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: మంత్రులను టెన్షన్ పెట్టిన సీఎం జగన్.. గ్యారంటీగా అదే అనుకున్న చాలామంది.. చివరకు..

YS Jagan: మంత్రులను టెన్షన్ పెట్టిన సీఎం జగన్.. గ్యారంటీగా అదే అనుకున్న చాలామంది.. చివరకు..

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

Andhra Pradesh: ముఖ్యమంత్రి ఉన్నట్టుండి కేబినెట్ భేటీ ఎందుకు పెట్టారు ? అంత హఠాత్తుగా తమను రావాలని ఎందుకు ఆదేశించారో చాలామందికి అర్థంకాలేదట.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అనూహ్య నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంతో పాటు శాసనమండలి రద్దు బిల్లును కూడా వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజాగా సినిమా టికెట్లకు సంబంధించి సినిమాటోగ్రఫీ చట్టంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఇలా తాను తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్.. కొద్దిరోజుల క్రితం మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారనే చర్చ జరుగుతోంది. గడిచిన సోమవారం ఏపీ సీఎం జగన్ అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఈ భేటీ అజెండా ఏమిటనే విషయం మాత్రం చాలామందికి తెలియదు.

ముగ్గురు నలుగురు మంత్రులకు మినహా.. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్న విషయం చాలామంది మంత్రులకు తెలియదట. దీంతో ముఖ్యమంత్రి ఉన్నట్టుండి కేబినెట్ భేటీ ఎందుకు పెట్టారు ? అంత హఠాత్తుగా తమను రావాలని ఎందుకు ఆదేశించారో చాలామందికి అర్థంకాలేదట. ఈ పరిణామంతో టెన్షన్ పడ్డ పలువురు మంత్రులు.. ఈ భేటీ అజెండా ఏంటనే విషయాన్ని తెలుసుకునేందుకు తమ సహచరులకు ఫోన్లు చేశారట. అయితే అక్కడి నుంచి కూడా తమకు ఏమీ తెలియదనే సమాధానం రావడంతో.. ఈ భేటీ వెనుక అసలు కారణం ఏంటనే దానిపై మంత్రులు వివిధ రకాలుగా ఊహించుకోవడం మొదలుపెట్టారని టాక్.

కొందరైతే.. రెండున్నరేళ్ల తరువాత ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ తప్పించి.. కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకుంటానని సీఎం జగన్ మొదట్లోనే చెప్పారని.. ఇప్పుడు సమయం పూర్తి కావడంతో ఆ దిశగా తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారేమో అని చర్చించుకున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులను రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందని కొందరు మంత్రులు దాదాపు ఫిక్స్ అయిపోయారట కూడా.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

మంత్రివర్గ సమావేశం మొదలైన తరువాత వరదలు సహా పలు అంశాలపై చర్చించిన సీఎం జగన్.. మంత్రులందరికీ మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్టు ఉన్న తీర్మానాన్ని అందించారట. అది చూసిన తరువాత మంత్రులంతా రిలాక్స్ అయ్యారని.. అప్పటివరకు ఇది తమకు మంత్రులుగా చివరి కేబినెట్ భేటీ అని అనుకున్నారని వైసీపీ వర్గాల్లోచర్చ జరుగుతోంది. మొత్తానికి మూడు రాజధానుల బిల్లు రద్దు రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ రేపినట్టుగానే.. మంత్రులను కూడా టెన్షన్ పెట్టినట్టు కనిపిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు