హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagan meets Governor: గవర్నర్ తో సీఎం జగన్ భేటీ.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్..

Jagan meets Governor: గవర్నర్ తో సీఎం జగన్ భేటీ.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్..

గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan).. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhushan Harichandan) తో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం జగన్ (AP CM YS Jagan).. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhushan Harichandan) తో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం.. 45 నిముషాలతో పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగింది. కేబినెట్లో మార్పులపై సమావేశంలో చర్చించిన జగన్.. మరో రెండు రోజుల్లో తుదిజాబితా ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 11న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని.. వారితో ప్రమాణస్వీకారం చేయించాలని సీఎం గవర్నర్ ను కోరారు. అంతకుముందు రాజ్ భవన్ కు వెళ్లిన సీఎంకు గవర్నర్ కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

ఈనెల 7వ తేదీన ప్రస్తుతం మంత్రివర్గం చివరి సమావేశం జరగనుంది. ఉదయం పల్నాడు జిల్లాలో జరిగే వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. మధ్యాహ్నం 3గంటలకు మంత్రివర్గ సమావేశానికి హాజరుకానున్నారు. ఇదే సమావేశంలో కేబినెట్ లో ఎవరుంటారు.. ఎవరికి ఉద్వాసన పలుకుతారనేదానిపై మంత్రులకు సీఎం స్పష్టతనిచ్చారు.

ఇది చదవండి: వాలంటీర్లకు సీఎం జగన్ సత్కారం.. రూ.250 కోట్లతో అవార్డులు

సీఎం జగన్ మంత్రివర్గంపై గవర్నర్ కు కూడా సమాచారం ఇవ్వడంతో ఆశావాహుల్లో టెన్షన్ పెరిగింది. ఇదే సమయంలో మంత్రి పదవిపై సమాచారం ఉన్నవాళ్లు, గట్టి నమ్మకంతో ఉన్నవారు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అలాగే పదవులిస్తామంటూ సీఎం నుంచి హామీ పొందిన మంత్రులు కూడా గాల్లో తేలిపోతున్నారంట. కొందరు సామాజిక సమీకరణాల వల్ల పదవి వరిస్తుందని లెక్కలేసుకుంటుండగా.. కొత్త జిల్లాలపై మరికొందరు ఆశలు పెట్టుకున్నారు.

ఇది చదవండి: ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఇదే..!

రేపటి కేబినెట్ భేటీలో మార్పుల అంశంపై మంత్రులకు సీఎం వివరణ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నాను అనే విషయాలపై జగన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. కేవలం మంత్రులకు క్లారిటీ ఇవ్వడమే కాదు.. అదేరోజు వారితో తమ పదవులకు సీఎం జగన్ రాజీనామా చేయిస్తారనే ప్రచారం ఉంది. ఆ తరువాత రెండు రోజుల పాలు పదవులు కోల్పోయిన మాజీలతో వన్ టు వన్ సీఎం మాట్లాడనున్నారు. ఎందుకు పదవుల నుంచి తప్పించాల్సి వచ్చింది. వారికి అప్పగించబోయే బాధ్యతలు ఏంటి.? వచ్చే ఎన్నికల కోసం ఎవరు ఏం చేయాలి అన్నదానిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు 10వ తేదీన కొత్తగా మంత్రివర్గంలో స్థానంపొందే వారికి సీఎం సమాచారం ఇవ్వనున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Governor