హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP Plenary-2022: రాష్ట్రంలో రాక్షసులు బయలుదేరారు..! ప్లీనరీలో జగన్ సంచలన కామెంట్స్..

YSRCP Plenary-2022: రాష్ట్రంలో రాక్షసులు బయలుదేరారు..! ప్లీనరీలో జగన్ సంచలన కామెంట్స్..

ప్లీనరీలో మాట్లాడుతున్న జగన్

ప్లీనరీలో మాట్లాడుతున్న జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రాష్ట్రస్థాయి ప్లీనరీ (YCP Plenary-2022) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం కడప జిల్లా (Kadapa District) ఇడుపులపాయ నుంచి నేరుగా గుంటూరు జిల్లాలోని ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ (AP CM YS Jagan).. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ కు నివాళులర్పించారు.

ఇంకా చదవండి ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రాష్ట్రస్థాయి ప్లీనరీ (YCP Plenary-2022) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం కడప జిల్లా (Kadapa District) ఇడుపులపాయ నుంచి నేరుగా గుంటూరు జిల్లాలోని ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ (AP CM YS Jagan).. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎన్ని కత్తులుగట్టినా.. ఎన్ని ఆరోపణలు, దుష్ప్రచారాలు చేసినా బెదరలేదని.. కట్టుకథలకు తలవంచలేదని జగన్ అన్నారు.

మనపై ఎన్ని కత్తులు గట్టినా.. ఎన్ని కుట్రలు చేసినా.. దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు బెదరలేదు.. సంకల్పం వెనక్కి తగ్గలేదని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు ఆయన అనుకూల మీడియాకు తోడు దత్తపుత్రుడు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ జాయింట్ గజదొంగల ముఠాను చూసి అన్ని రకాలుగా ఆరోపణలు చేస్తున్నా ఇంటింటికీ వెళ్లి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

ఇది చదవండి: తండ్రికి నివాళులర్పించిన సీఎం జగన్.. పాల్గొన్న కుటుంబ సభ్యులు


చంద్రబాబు ఆయన గజదొంగల ముఠా దోచుకోవడం.. దాచుకోవడం సాధ్యం కాకనే అసత్య ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. వీళ్లందరి దోపిడీకి అవకాశం లేకపోవడంతోనే కడుపు మంట అన్నారు. వారికి ఎన్ని జెలొసిన్ మాత్రలిచ్చినా లాభం లేదన్నారు. మన గెలుపును అడ్డుకోవడం వారి వల్ల కాదు కాబట్టే రాక్షసులంతా ఒక్కటవుతున్నారని జగన్ విమర్శించారు. గెలుపు సాధ్యం కాదు కాబట్టే రాష్ట్రంలో కులాల కుంపట్లు.. మతాల మంట పెడుతున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు మాదిరిగా మీడియా అండ, దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చని.. తనకున్నది కేవలం ప్రజల తోడు మాత్రమేనని జగన్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేస్తున్న మనమెక్కడా.. హామీలంటే పారిపోయిన వాళ్లెక్కడ అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తమకు పోటీనే కాదన్నారు జగన్.


ఇది చదవండి: వైసీపీకి విజయమ్మ గుడ్ బై.. ప్లీనరీలో సంచలన ప్రకటన

అధికారం అంటే అహంకారం కాదని.. ప్రజలపై మమకారమని జగన్ అన్నారు. తనపై ఎన్ని వ్యవస్థలు కత్తిగట్టినా.. తన గుండెం అదరలేదు.. బెదరలేదన్నారు. అందుకే 2019లో ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 సీట్లిచ్చి ఆశీర్వదించారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోని ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి అమలు చేస్తున్నారని.. టీడీపీ మాత్రం మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి, యూట్యూబ్ నుంచి కూడా డిలీట్ చేసిందన్నారు. వైసీపీ మేనిఫెస్టో చూసే ధైర్యం కూడా టీడీపీకి లేదన్నారు జగన్.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు