Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN MADE SENSATIONAL ALLEGATIONS ON JANASENA CHIEF PAWAN KALYAN IN KAKINADA FULL DETAILS HERE PRN

Jagan on Pawan: కాపు ఓట్లను అమ్మేందుకు కుట్ర.. పవన్ పై జగన్ సంచలన కామెంట్స్..

 చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. కాకినాడలో వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని (YSR Kapu Nestham) ప్రారంభించిన ఆయన.. జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు ( Chandrababu) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. కాకినాడలో వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని (YSR Kapu Nestham) ప్రారంభించిన ఆయన.. జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు ( Chandrababu) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కాపు ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మేందుకు దత్తపుత్రుడు యత్నిస్తున్నాడంటూ పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు జగన్. అంతేకాదు టీడీపీ హాయంలో చంద్రబాబు, పవన్ ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. తమ హయాంలో బటన్ నొక్కిన వెంటనే నేరుగా డబ్బులు అకౌంట్లో పడుతున్నాయన్నారు. చంద్రబాబు డీపీటీ పథకం అమలు చేశారని అంటే.. దోచుకో పంచుకో తినుకో అనేలా పథకాలు అమలు చేశాయన్నారు.

    చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాకు తోడు వారి దత్తపుత్రుడు కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకొని పంచుకున్నారన్నారు. వీరికి తెలిసిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం అదేనన్నారు. సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయాలని టీడీపీ అంటోందని.. ఆయన అనుకూల మీడియా మాత్రం రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని వెంటకారం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న డీబీటీ ఇస్తున్న పథకాలు కావాలా.. చంద్రబాబు అమలు చేసిన దోచుకో పంచుకో తినుకో అనే పథకం కావాలో ప్రజలే అలోచించుకోవాలన్నారు. మన ప్రభుత్వంలో వందల సామాజిక వర్గాల బాగుపడటం కావాలా లేక చంద్రబాబు, ఆయన దుష్టచతుష్టయం, దత్తపుత్రుడి బాగుపడటం కావాలా అనేది అలోచించాలన్నారు. ప్రతి పథకాన్ని ప్రతి ఒక్కరికీ అందించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

    ఇది చదవండి: కాపునేస్తం మూడో విడత నగదు జమ.. కాపులకు రూ.32వేల కోట్లు ఇచ్చామన్న సీఎం


    మోసం, వెన్నుపోటు, వంచనతో కూడిన మేనిఫెస్టోలు ఇచ్చిన పచ్చి అబద్ధాల చంద్రబాబు మార్కు పాలన కావాలా అనేదానిపై చర్చ జరగాలన్నారు. కాపులతో సహా ప్రతి పేద కుటుంబానికి మంచి జరిగేలా పాలన అందిస్తున్న జగన్ కావాలా అనేది ప్రజలు అలోచించుకోవాలన్నారు. ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు మరోసారి అమ్మేసి సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 26వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వివరాలివే..


    గతంలో ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్ ఉందని.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడని.. అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు.. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ప్రజలు చూడాలన్నారు. ఈరోజు బటన్ నొక్కడం ద్వారా ఎలాంటి వివక్ష లేకుండా పేదల ఖాతాల్లో వేస్తున్నామన్నారు. అప్పుడు బటన్ నొక్కడం లేకుండా కేవలం దోచుకోవడానికే పాలన చేశారన్నారు.


    ఇది చదవండి: అంత్యక్రియలు చేసిన 41 రోజుల తర్వాత ప్రత్యక్షం.. ఫ్యామిలీ ఫ్యూజులు ఔట్..


    వరదల మీద కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని జగన్ విమర్శించారు. హుద్ హుద్ సమయంలో 11రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించానని చెప్పారు. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తిరిగితే ఒక్కబాధితుడికి కూడా న్యాయం చేయలేదన్నారు. తుఫాన్ బాధితులకు పాచిపోయిన పులిహోర, 10 కిలోల బియ్యం తప్ప ఒక్క రూపాయి ఆర్ధిక సాయం చేయలేదన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు