హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagan on Cabinet: త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Jagan on Cabinet: త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గత కొంతకాలంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Changes) పైనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్ (CM YS Jagan) నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావొస్తుండటంతో ఏ క్షణాన్నైనా మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గత కొంతకాలంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Changes) పైనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్ (CM YS Jagan) నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావొస్తుండటంతో ఏ క్షణాన్నైనా మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారం సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తానని సీఎం చెప్పారు. ఐతే కరోనాతో పాటు కొన్ని రాజకీయ కారణాల వల్ల కేబినెట్ లో మార్పులు చేయడం ఆలస్యమైంది. ఐతే బడ్జెట్ ను ఆమోదించేందుకు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం.. మంత్రులతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

  మంత్రి పదవి నుంచి తప్పించేవారి లిస్ట్ చెప్పకపోయినా.. పదవి కోల్పోయిన వారికి ఇచ్చే బాధ్యతలపై సీఎం స్పష్టతనిచ్చారట. కేబినెట్ నుంచి తప్పించిన వారు పార్టీ కోసం పనిచేయాలని జగన్ సూచించారని తెలుస్తోంది. ఐతే మొత్తాన్ని తప్పించనని.. కొందరిని కొనసాగిస్తామని సీఎం చెప్పినట్లు టాక్.

  ఇది చదవండి: అసెంబ్లీ ముందుకు వ్యవసాయ బడ్జెట్.. ఈ సారి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..!

  మంత్రివర్గంలో మార్పులపై సీఎం తొలిసారి కామెంట్స్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ ఆశావాహులు, ముఖ్యనేతలు పార్టీలోనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. జగన్ నుంచి హామీ పొందిన వారు కూడా గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు ఉండటంతో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  ఇది చదవండి: ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇలా.. ఏ రంగానికి ఎంత ఇచ్చారంటే..!

  ఇప్పటికే మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేయాలి.. ఎవర్ని తీసుకోవాలనే అంశంపై సీఎం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. జూలైలో పార్టీ ప్లీనరీకి సన్నాహాలు జరుగుతున్నందున.. ఆ లోపే మంత్రివర్గంలో మార్పులుండే అవకాశముంది. ప్లీనరీలో పార్టీ పదవులు, ఇతర బాద్యతలు అప్పగించే ఛాన్స్ ఉండటంతో ఆ లోగానే మంత్రివర్గంలో పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

  ఇది చదవండి: జాతీయ స్థాయిలో సీఎం జగన్ రికార్డు.. వరుసగా మూడోసారి టాప్ ప్లేస్..

  ఐతే మంత్రివర్గంలో ఎవర్ని తప్పిస్తారు.. ఎవర్ని కొనసాగిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కొనసాగింపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. మంత్రులగా కొనసాగే లిస్టులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు కూడా వినిపించింది. ఐతే ఆయన హఠాన్మరణంతో ఆయన కుటుంబంలో ఒకరికి పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఆశావాహుల్లో నగరి ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, గ్రంథి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, స్పీకర్ తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు, పీడిక రాజన్నదొర, దాడిశెట్టి రాజా, తోట త్రిమూర్తులు, ఆనం రామనారాయణ రెడ్డి,గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి వంటి నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు