AP POLITICS AP CM YS JAGAN MADE KEY ANNOUNCEMENT ON JANGAREDDY GUDEM MYSTERY DEATHS AND ILLICIT LIQUOR IN THE STATE FULL DETAILS HERE PRN
CM Jagan: కల్తీమద్యంపై సీఎం కీలక ప్రకటన.. జంగారెడ్డిగూడెం ఇష్యూలో క్లారిటీ ఇచ్చిన జగన్
అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 18 మంది మృతి చెందారని టీడీపీ (TDP) ఆరోపిస్తుంటే.. అవి సహజ మరణాలని వైసీపీ (YSRCP) వాదిస్తోంది. దీంతో అసెంబ్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly 2022) లో తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. నాటుసారా తాగి 18 మంది మృతి చెందారని టీడీపీ (TDP) ఆరోపిస్తుంటే.. అవి సహజ మరణాలని వైసీపీ (YSRCP) వాదిస్తోంది. దీంతో అసెంబ్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఘటన గురించిన పూర్తి వివరాలను సభ ముందుంచారు. జంగారెడ్డిగూడెంలో ప్రస్తుతం జనాభా 54,880 మంది నివాసముంటున్నారని.., ఇంత పెద్ద మున్సిపాల్టీలో జరిగిన మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కాదన్నారు. మొత్తం మున్సిపాల్టీలో కలిపి జరిగిన మరణాలే వీళ్లు చెపుతున్న ఈ 18 మంది అని వివరించారు. . దేశవ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య అంచనా 2 శాతం డెత్రేటు వేసుకున్నా.. కనీసం 90 మంది వివిధ కారణాల వల్ల చనిపోతుంటారని సీఎం అన్నారు. అలాంటిది సహజ మరణాలను కూడా వక్రీకరించి మాట్లాడ్డం ఇక్కడే చూస్తున్నామని సీఎం అన్నారు.
అక్కడక్కడా జరుగుతున్నాయ్..!
కల్తీ మద్యం తయారు చేసే వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుందని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో గతంలో అక్రమ మద్యం తయారీ జరిగిందని.., ఇప్పుడు కొత్తగా జరిగిందీ కాదన్నారు. టీడీపీ హయాంలో జరగనిదే ఇప్పుడు జరగడం లేదన్న జగన్.. ఇప్పుడు కూడా అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తాను కాదనడం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం, నాటు సారా వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బెల్టు షాపులు రద్దు చేశాం
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్టు షాపులను పూర్తిగా లేకుండా చేశామని.., అంతే కాకుండా 4380 మద్యం షాపులను సగానికి తగ్గించినట్లు వివరించారు. లాభ ఆపేక్ష ఉంటే ఏనాటికైనా వీటిని ఆపలేమనే ఉద్దేశ్యంతో... ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసి మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నడిపే కార్యక్రమం చేస్తుందని జగన్ న్నారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.
ప్రతిపక్షాలు చెప్పినట్టే చేశాం..
మద్యం వినియోగం తగ్గేలా రేట్లు పెంచామని.. ఐతే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అక్రమ మద్యం పెరిగుతుందన్న ప్రతిపక్షాలు, ప్రజల సూచనన మంచి ఉద్దేశంతో తీసుకొని మళ్లీ పాతరేట్లనే తీసుకొచ్చామన్నారు. రేట్లు తగ్గించిన తర్వాత.. మన రేట్లు ఎక్కువ, విపరీతంగా పెంచామని ఎవరూ చెప్పడానికి కూడా అవకాశం లేదన్నారు. ధరలు తగ్గించినప్పుడు కల్తీ మద్యం ఎలా వస్తుందని ప్రశ్నించారు.
కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వం క్లారిటీగా ఉందని.. అలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని జగన్ స్పష్టం చేశారు. కానీ సహజ మరణాలను కూడా అక్రమ మద్యంతోనే చనిపోయారంటూ భ్రమలు కల్పిస్తూ నానా యాగీ చేస్తున్నారని సీఎం విమర్శించారు. అక్రమ మద్యంపై 13 వేల కేసులను ఎస్ఈబీ నమోదు చేసిందని.., అక్రమ మద్యం ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇన్ని కేసులు రిజిస్టర్ చేసినట్లు జగన్ వెల్లడించారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా, కల్తీ మద్యం వల్ల ఏదో జరిగిపోతుంది అన్నట్టు భ్రమ కల్పిస్తూ... వీరు చేస్తున్న అన్యాయమైన పనిని మాత్రం మానుకోవాలని సీఎం అన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.