హోమ్ /వార్తలు /andhra-pradesh /

YS Jagan: కుప్పం ఎమ్మెల్యే కోరిక మేరకు ఆ పనిచేశాం.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

YS Jagan: కుప్పం ఎమ్మెల్యే కోరిక మేరకు ఆ పనిచేశాం.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ (AP CM YS Jagan) వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం, ప్రాముఖ్యత వంటి అంశాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ (AP CM YS Jagan) వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం, ప్రాముఖ్యత వంటి అంశాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏయే ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేసిందీ..? పేర్లను ఎలా నిర్ణయించిందీ..? అనే అంశాలను జగన్ వివరించారు. ఈ క్రమంలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కూడా చర్చకు వచ్చింది. కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రస్తావించిన జగన్.. తనదైన శైలిలో చంద్రబాబుకు చురకలంటించారు.

  ఇక కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.. 14 ఏళ్లు ఆయన సీఎంగా ఉన్నా.. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసులేక ప్రభుత్వానికి లేఖ రాశారని.., స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. పనిలోపనిగా చంద్రబాబు చేయలేని పనిని తాము చేశామని జగన్ చెప్పకనే చెప్పారు.

  ఇది చదవండి: ఏపీలో నవశకం.. కొత్త జిల్లాలకు సీఎం జగన్ శ్రీకారం..

  ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదులో భాగంగా చిత్తూరు జిల్లాలో కొత్త కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, కుప్పం, శాంతిపురం, గూడుపల్లె, రామకుప్పం మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండలాలు ప్రస్తుతం మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. కుప్పం రెవెన్యూ డివిజన్లో ఆరు మండలాలున్నాయి. ఇందులో 3,16,109 మంది జనాభా ఉంది. వీరిలో 1,60,780 మంది పురుషులు, 1,55,455 మంది మహిళలు ఉన్నారు.

  ఇది చదవండి: ‘మూడో అడుగు అటువైపే..’ కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక ప్రకటన.. తెరపైకి మూడు రాజధానులు..!

  కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంపై గతంలోనే స్థానిక ప్రజలు సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కుప్పంకు రెవెన్యూ డివిజన్ కేటాయించారు. దీనికి తోడు చంద్రబాబు కూడా లేఖరాయడంతో జగన్ సర్కార్ పని మరింత ఈజీ అయింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో పలువురు అధికార, ప్రతిపక్ష ప్రతినిథులు ప్రభుత్వానికి విజ్ఞప్తులను పంపారు. వీటిలో కొన్నింటిని మాత్రమే అంగీకరించిన జగన్.. చంద్రబాబు లేఖకు స్పందించి డివిజన్ కేటాయించారన్న చర్చ జరుగుతోంది.

  First published:

  ఉత్తమ కథలు