హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: అంతాకలిసి నా వెంట్రుక కూడ పీకలేరు.. మరోసారి సీఎం జగన్ హాట్ కామెంట్స్..

YS Jagan: అంతాకలిసి నా వెంట్రుక కూడ పీకలేరు.. మరోసారి సీఎం జగన్ హాట్ కామెంట్స్..

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

ప్రతిపక్షాలపై సీఎం జగన్ (AP CM YS Jagan) మరోసారి విరుచుకు పడ్డారు. శ్రీకాకుళం (Srikakulam) లో అమ్మఒడి పథకం మూడో విడత డబ్బులు జమ చేసిన అనంతరం ప్రసంగించిన సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబుతో కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు.

ప్రతిపక్షాలపై సీఎం జగన్ (AP CM YS Jagan) మరోసారి విరుచుకు పడ్డారు. శ్రీకాకుళం (Srikakulam) లో అమ్మఒడి పథకం మూడో విడత డబ్బులు జమ చేసిన అనంతరం ప్రసంగించిన సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబుతో కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు. తాను కేవలం చంద్రబాబుతో మాత్రమే పోరాటం చేయటం లేదని.. మారీచులతో.. కుట్రలు -కుయుక్తులు పన్నే వారితో యుద్ధ చేస్తున్నానని జగన్ అన్నారు. వీరంతా కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వారితో యుద్దానికి తాను సిద్దమేనని.. ప్రజల మద్దతే తనకు బలమని స్పష్టం సీఎం చేశారు. జగన్ ఒక్కడే ఇంత మందితో యుద్దం చేస్తున్నాడని.. మీ అందరి మద్దతు ఉందనే నమ్మకంతోనే ముందుడుగు వేస్తున్నానని సీఎం జగన్ అన్నారు.

అమ్మఒడిపై విమర్శలు చేస్తున్నవారికి గతంలో పిల్లలను చదవిస్తున్న తల్లులకు ఒక్కరూపాయి ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. రూపాయి సాయం చేయకపోగా.. విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. అలాగే ఈసారి 51 వేల మంది లబ్ధిదారులను తొలగించడంపైనా సీఎం వివరణ ఇచ్చారు. విద్యార్థులకు 75శాతం హాజరు లేకపోవడం వల్లే 51 వేల మందిని తొలగించామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని.., అమ్మఒడి పేరుతో ఎవరికీ ఎగ్గొట్టే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. తాము 51 వేల మందికి ఇవ్వలేకపోతున్నామని కారణం చెబుతూనే.. ఎందుకు పాఠశాలలు - మరుగుదొడ్ల నిర్వహణ కోసం రెండు వేలు మినహాయిస్తున్న విషయాన్ని చెప్పి మరీ నిధులు అందిస్తున్నామని వివరించారు.


ఇది చదవండి: అమ్మఒడి మూడో విడత నగదు జమ..! అందుకు బాధగా ఉందన్న సీఎం జగన్


పథకాల అమలు విషయంలో నిజం చెప్పై నిజం చెప్పే ధైర్యం ప్రతిపక్షాలకు ఉందా అంటూ జగన్ నిలదీసారు. మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం వాగ్దానాలు మూడేళ్లలో అమలు చేసామన్నారు. డబ్బులు ఉన్న వారి పిల్లలకే అందుబాటులో ఉన్న బైజూస్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన చదువులు అందిస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఎగ్గొట్టేనైజమే ఉంటే ఇలాంటి పథకం అమలు చేయాలన్న ఆలోచనే చేసేవాళ్లం కాదన్నారు.


ఇది చదవండి: సీఎం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారా..? ఆ విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనా..?


రాష్ట్రంలో పేద పిల్లలకు సాంకేతికతతో కూడిన చదువు అందించేందుకు బైజూస్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. రూ.24వేల విలువైన యాప్ పేద పిల్లలకు ఉచితంగా వస్తోందన్నారు. అలాగే 8వ తరగతిలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి రూ.12వేలు విలువైన ట్యాబ్ ను అందిస్తామన్నారు. అంతటి మంచి పథకాలను అందిస్తుంటే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో డిజిటల్ విద్యనందించేందుకు ప్రతి క్లాస్ రూమ్ లో టీవీలు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు