Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN GETS EMOTIONAL AT MEKAPATI GOUTHAM REDDY MEMORIAL MEETING IN NELLORE DISTRICT FULL DETAILS HERE PRN

YS Jagan on Goutham Reddy: గౌతమ్ రెడ్డిని తల్చుకొని ఎమోషనల్ అయిన జగన్.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న సీఎం..

సీఎం జగన్ తో మంత్రి మేకపాటి (పాత ఫొటో)

సీఎం జగన్ తో మంత్రి మేకపాటి (పాత ఫొటో)

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ని తల్చుకొని సీఎం జగన్ (AP CM YS Jagan) ఎమోషన్ అయ్యారు. సోమవారం నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడులో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంస్మరణ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.

    దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ని తల్చుకొని సీఎం జగన్ (AP CM YS Jagan) ఎమోషన్ అయ్యారు. సోమవారం నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడులో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంస్మరణ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు పార్టీకి, తనకు తీర్చలేనిదని అభిప్రాయపడ్డారు. గౌతమ్ అందరి మనస్సుల్లో అగ్రస్థానంలో నిలిచారని.. ఆయన్ను కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్మించుకోలేకపోతున్నాని.. నమ్మడానికి ఇంకా కష్టంగానే ఉందని జగన్ అన్నారు. అంతేకాదు గౌతమ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని, ఆయనతో జ్ఞాపకాలని సీఎం నెమరువేసుకున్నారు.

    “గౌతమ్‌ గురించి చెప్పాలంటే... నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. మంచి స్నేహితుడు. నాకు బాగా గుర్తుంది. రాజకీయాల్లోకి తను అప్పుడు ఇంకా అడుగుపెట్టలేదు. నేను లేకపోయి ఉండుంటే.. గౌతమ్‌ బహుశా రాజకీయాల్లోకి కూడా వచ్చి ఉండేవాడు కాదేమో. రాజకీయ ఆలోచన కూడా లేదు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేను అడుగు బయటికి అడుగులు వేసినప్పుడు 2009–10 ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీతో ఒక యుద్ధం మొదలైంది. అప్పట్లో రాజమోహన్‌రెడ్డి గారు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా ఉన్నారు. నేను 2009లో అప్పుడే ఎంపీగా ఎన్నికయ్యాను. కానీ రాజమోహన్‌ రెడ్డిగారు కంటే గౌతమ్‌తో నాకున్న సాన్నిహిత్యమే.. రాజమోహన్‌ రెడ్డిగారిని నావైపున ఉండేటట్టుగా గౌతమ్‌ ఒత్తిడి, అభిమానమే ఎక్కువగా పనిచేసిందని చెప్పాలి. ఆ రకంగా ప్రతి అడుగులోనూ గౌతమ్‌ తోడుగా ఉన్నాడు. 2009–10 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ నాకు తోడుగా, స్నేహితుడిగా ఉన్నాడు. నా కన్నా గౌతమ్‌ వయస్సులో సంవత్సరం పెద్ద. అయినా ఎక్కడా కూడా తాను నాకన్నా పెద్ద అన్న భావం మనస్సులో ఉండేది కాదు. నన్నే ఒక అన్నగా భావించేవాడు. తను నువ్వు చేయగలుగుతావు... మేమంతా ఉన్నాం అని నన్ను ప్రోత్సహించేవాడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామన్నది ఈ రోజుకు కూడా జీర్ణం చేసుకోలేని అంశం.” అని సీఎం అన్నారు.

    ఇది చదవండి: ఏపీ బీజేపీలో లుకలుకలు..? సోముకి వ్యతిరేకంగా అసమ్మతివర్గం..? ఆ భేటీకి కారణం ఇదేనా..!


    రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని గౌతమ్ రెడ్డి నిత్యం తపనపడేవారన్న జగన్.. దుబాయ్ పర్యటనకు ముందు కూడా తనను కలిశారన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత తనను కలిసేందుకు టైమ్ తీసుకున్నారని.. అక్కడి పర్యటన వివరాలు వెల్లడిస్తానని కూడా చెప్పారని.. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందన్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టామన్న సీఎం జగన్.. వెలిగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి గౌతమ్ కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. మెరిట్స్ కాలేజీని అగ్రికల్చర్ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తామన్న జగన్ అన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mekapati Goutham Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు