Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN FOCUSED ON THESE TDP CONSTITUENCIES AS HE MEETS PARTY ACTIVISTS EVERY MONTH FULL DETAILS HERE PRN GNT

YS Jagan: సీఎం జగన్ కొత్త టార్గెట్.. ఆ నియోజకవర్గాలపైనే ఫోకస్.. కారణం ఇదే..!

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనపై మాత్రమే దృష్టిపెట్టిన సీఎం జన్ (CM YS Jagan).. పార్టీని పూర్తిగా విస్మరించారనే విమర్శలు వినిపించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • andhra, India
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనపై మాత్రమే దృష్టిపెట్టిన సీఎం జగన్ (CM YS Jagan).. పార్టీని పూర్తిగా విస్మరించారనే విమర్శలు వినిపించాయి. ప్రతిపక్ష నేత హోదాలో నిత్యం ప్రజలలో ఉన్న జగన్ అధికార పీఠం ఎక్కిన తరువాత పార్టీ కార్యకర్తలకు దాదాపుగా కనిపించడమే మానేశారని చెప్పవచ్చు. ఒకానొక దశలో నియోజకవర్గ సమస్యలుపై చర్చించాలంటే ఎమ్మెల్యేమైన తమకే అందుబాటులో ఉండటం లేదని కొందరు బాహాటంగానే తమ ఆవేదన వెళ్ళగక్కారు. ఐతే రానున్న ఎన్నికలను ధృష్టిలో పెట్టుకుని జగన్ ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలను చైతన్య పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈనెల 4వ తేదీ నుంచి నేరుగా కార్యకర్తలతోనే భేటీ అవతున్నారు.

    ఇక నుండి నెలకు పది పదిహేను నియోజకవర్గాల కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచే మొదలుపెట్టారు. కుప్పం నుండి చంద్రబాబు నాయుడు ఇప్పటికి వరుసగా ఏడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. దీంతో మిషన్ 2024ను అక్కడి నుంచే మొదలుపెట్టాలనే లక్ష్యంతో కుప్పంకు చెందిన 50 మంది వైసీపీ కార్యకర్తలను పిలిచి మాట్లాడారు. అంతేకాదు కుప్పం తన సొంత నియోజకవర్గమేని.. అక్కడ భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించారు.

    ఇది చదవండి: యాదాద్రిలో మంత్రి రోజా.. వరలక్ష్మీ వ్రతం నాడు ప్రత్యేక పూజలు


    సీఎం జగన్ ప్రధానంగా గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచిన నియోజకవర్గాలపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటికే టీడీపీ, జనసేనకు చెందిన ఎమెల్యేలు వైసీపీకి జై కొట్టారు. ఆయా నియోజకవర్గాలను పక్కనబెట్టి.. టీడీపీ వైపు గట్టిగా నిలబడిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కుప్పం, హిందూపురం, టెక్కలి, విశాఖపట్నం, రాజమండ్రి రూరల్, పాలకొల్లు, విజయవాడ ఈస్ట్, పర్చూరు, ఉరవకొండ వంటి నియోజకవర్గాల్లో గెలుపుకు పావులు కదుపుతున్నారు.

    ఇది చదవండి: ఏపీ కోస్తా తీరానికి కోత ముప్పు.. షాకింగ్ విషయాలు చెప్పిన కేంద్రం


    మరీ ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాంటి లీడర్లను ఓడించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును మరోసారి అసెంబ్లీకి రానివ్వకూడాదని.. ఆయన్ను ఓడించడం ద్వారా వైసీపీకి తిరుగులేదని నిరూపించాలనేది సీఎం లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కూడా అసెంబ్లీకి దూరం చేయాలని పార్టీ నేతలకు ఆదేశించారట. అలాగే సోషల్ మీడియాలో ప్రభుత్వం నిత్యం సెటైర్లు, విమర్శలు చేస్తున్న గోరంట్ల బచ్చయ్య చౌదరిని కూడా జగన్ తన హిట్ లిస్టులో పెట్టుకున్నారట. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేసి ఎన్నికల నాటికి వారిని మరింత ప్రోత్సహించాలని నిర్ణయించారట.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు