హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: కీలక జిల్లాలో విభేదాలకు సీఎం జగన్ చెక్.. ఆ విషయంలో సక్సెస్ అయ్యారా..?

YS Jagan: కీలక జిల్లాలో విభేదాలకు సీఎం జగన్ చెక్.. ఆ విషయంలో సక్సెస్ అయ్యారా..?

కర్నూలు వైసీపీలో విభేదాలకు చెక్

కర్నూలు వైసీపీలో విభేదాలకు చెక్

2024లో 175కి 175 సీట్లే లక్ష్యంగా సీఎం జగన్ (AP CM YS Jagan) పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలో అంతర్గత విభేదాలను చక్కదిద్దుతూ వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ (YSRCP) కి స్ట్రాంగ్ బేస్ ఉన్న కర్నూలు జిల్లా (Kurnool District) పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ దృష్టి పెట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

2024లో 175కి 175 సీట్లే లక్ష్యంగా సీఎం జగన్ (AP CM YS Jagan) పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలో అంతర్గత విభేదాలను చక్కదిద్దుతూ వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ (YSRCP) కి స్ట్రాంగ్ బేస్ ఉన్న కర్నూలు జిల్లా (Kurnool District) పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే హఫీస్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి, జె సుధాకర్, హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. అందరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇప్పటికే ఆయా నేతలను పిలిచి మాట్లాడిన అధిష్టానం.. అందరూ కలిసి పనిచేసే వాతావరణాన్ని కల్పించింది. పార్టీ అధిష్టానం దేశాల మేరకు కర్నూలు జిల్లాలో వైసీపీ సీనియర్ నేతలంతా సమావేశమై విభేదాలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు.

ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు ఆకెపాటి, రామసుబ్బా రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాల్సిందేనని నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. కర్నూలు జిల్లా వైసీపీ నెలకొన్న సిందిగ్ధతకు ఈ సమావేశం చెక్ పెట్టిందన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లూ ఏయే విషయాల్లో విభేదించారో ఆ అంశాలపై నేతలంతా క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేకు ఆనంకు షాక్.. వెంకటగిరికి ఇంఛార్జ్‌గా మరో నేత

మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సచివాలయ కన్వీనర్ల నియామకంలో ఎమ్మెల్యేకు మాత్రమే బాధ్యత అప్పజెప్పినందుకు మొదట ఇబ్బంది పడినా మీటింగ్ తరువాత అంగీకరించారు. ఇక నుంచి ఇద్దరూ కలిసి పనిచేసేలా నిర్ణయం తీసుకున్నారు జనవరి మొదటి వారంలోఇద్దరూ కలిసి క్యాడర్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని పార్టీ కోసం కలిసి పనిచేసేవిధంగా ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చారు.

ఇది చదవండి: జోరుగా ఏపీ రాజకీయాలు .. 14 నెలల ముందే హడావుడి!

ఇదే క్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే జే.సుధాకర్, కుడా ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య కూడా అంతర్గత సమావేశం జరిగినట్లు సమాచారం. గతంలో జరిగిన విభేధాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల కోసం కలిసి పనిచేసేలా ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సమావేశంలో కోట్ల హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా.. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలను స్పష్టంగా ఇద్దరికీ చెప్పడంతో అంతా సైలెంట్ అయ్యారు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి పనిచేసేలా ఒప్పించారు. సచివాలయ కన్వీనర్లు, ఇతర నియామకాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.

వన్స్ మోర్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిన సీఎం జగన్.. సొంతపార్టీలో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ కి చెక్ పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారని వైసీపీ నేతలంటున్నారు అందులో భాగంగానే కర్నూలులో వర్గపోరుకు ముగింపు పలికారని.. భవిష్యత్తులో మిగిలిన జిల్లాల్లోనూ ఇలాంటి ఫార్ములానే అమలు చేస్తారని తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Kurnool, Ysrcp