ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయాయి. ఆయా పార్టీల తీరు చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతోంది. మరోవైపు ఏపీలో మరోసారి అధికారం దక్కించుకోవడంపై ఫోకస్ పెట్టిన అధికార వైసీపీ(Ysrcp).. ఇందుకోసం అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ. ఈసారి కూడా అదే స్థాయిలో గెలుపును సొంతం చేసుకోవడం ఎలా అనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. ఇక రాబోయే ఎన్నికల్లోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) ఓడించాలనే అంశంపై వైసీపీ గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయడంలో విజయం సాధించింది.
వచ్చే ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రాకుండా చేయాలని భావిస్తున్న వైసీపీ .. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఈ సారి మళ్లీ అక్కడ పోటీ చేయకపోవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటికి బదులుగా కాపుల బలం ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై అటు జనసేన , ఇటు పవన్ కళ్యాణ్ ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం(Pitapuram) నుంచి బరిలోకి దిగితే ఆయనను ఓడించడం ఎలా అనే అంశంపై వైసీపీ గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా వైసీపీ తరపున దొరబాబు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే.. ఆయనకు బదులుగా ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న వంగా గీతను అసెంబ్లీ బరిలో దింపాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోందని సమాచారం.
AP Politics: రాష్ట్ర విభజన హామీల పరిస్థితి ఏంటి..? రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరేది ఎప్పుడు..?
School Holidays: ముంచుకొస్తున్న మాండూస్ తుఫాన్.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
మరోవైపు వంగా గీత సైతం అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీలోని రావాలని ఆహ్వానిస్తోంది ఆ పార్టీ. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే.. ఈ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపాలని అనుకుంటున్నట్టు టాక్. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావిస్తున్న పిఠాపురం సీటుపై వైసీపీ కూడా పక్కా ప్లాన్‌తోనే ఉన్నట్టు అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.