ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Part).. పార్టీ పదవులను ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్ల జాబితాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Part).. పార్టీ పదవులను ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్ల జాబితాలను విడుదల చేశారు. మాజీ మంత్రులు, ముఖ్యనేతలకు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించిన జగన్.. రీజినల్ కో-ఆర్డినేటర్ల బాధ్యతలు కూడా పలువురు మాజీ మంత్రుల చేతుల్లో పెట్టారు. మాజీ మంత్రులు అనిల్ కుమార్, బాలినేని, కొడాలి నానికి రీజనల్ కో-ఆర్డినేటర్ పదవులు దక్కగా.. పేర్ని నాని, ఆళ్లనాని, రంగనాథరాజు, అవంతి శ్రీనివాస్, కృష్ణదాస్, శంకర్ నారాయణ, వెల్లంపల్లికి జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి.
చిత్తూరు కేఆర్జే భరత్, అనంతపురం కాపు రామచంద్రారెడ్డి, శ్రీ సత్యసాయి ఎం. శంకర్ నారాయన, అన్నమయ్య జిల్లా గడికోట శ్రీకాంత్ రెడ్డి, కర్నూలు వై.బాలానాగిరెడ్డి, నంద్యాల కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్ కడప కే.సురేష్ బాబు, తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా బుర్రా మధుసూదన్ యాదవ్, బాపట్ల మోపిదేవి వెంకటరమణ, గుంటూరు మేకతోటి సుచరిత, పల్నాడు జిల్లా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వెల్లంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా పేర్ని నాని, ఏలూరు జిల్లా ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తూర్పు గోదావరి జిల్లా జక్కంపూడి రాజా, కాకినాడ కురసాల కన్నబాబు, కోనసీమ పొన్నాడ సతీష్, విశాఖపట్నం అవంతి శ్రీనివాస్, అనకాపల్లి కరణ ధర్మశ్రీ, అల్లూరి సీతారామరాజు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పార్వతీపురం మన్యం పాముల పుష్ప శ్రీవాణి, విజయనగరం జిల్లా చిన్న శ్రీను, శ్రీకాకుళం జిల్లా ధర్మాన కృష్ణదాస్ ను జిల్లా అధ్యక్షులుగా నియమించారు.
ఇక రీజనల్ కో-ఆర్డినేటర్ల విషయానికి వస్తే..
చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాలకుక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కొడాలి నాని, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు మర్రి రాజశేఖర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఎంపీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బొత్ససత్యనారాయణ ను కో ఆర్డినేటర్లుగా నియమించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.