హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Family: తండ్రికి నివాళులర్పించిన సీఎం జగన్.. పాల్గొన్న కుటుంబ సభ్యులు

YS Family: తండ్రికి నివాళులర్పించిన సీఎం జగన్.. పాల్గొన్న కుటుంబ సభ్యులు

ఇడుపులపాయలో సీఎం జగన్

ఇడుపులపాయలో సీఎం జగన్

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి (YSR Birth Anniversary) సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, ఏపీ సీఎం జగన్ దంపతలు, వైఎస్ షర్మిల పాల్గొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి (YSR Birth Anniversary) సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, కుమారుడు, ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan), ఆయన సతీమణి భారతి రెడ్డి, వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఆమె కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్.. అనంతరం కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు.


వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం.. అక్కడికి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులతో మాట్లాడిన సీఎం జగన్.. గుంటూరులో జరిగే వైసీపీ ప్లీనరీకి బయలుదేరి వెళ్లారు. స్థానికుల నేతలు, అభిమానులు జగన్ కు వీడ్కోలు పలికారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, YS Sharmila

ఉత్తమ కథలు