ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan) రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 6.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం జనపథ్ నివాసంలో సీఎం బస చేస్తారు. 31న (మంగళవారం) ఉదయం 10.30 నుంచి 5.30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో జరగబోయే ఆంధప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమ్మిట్ లో జగన్ (Cm Jagan) ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమం అనంతరం మంగళవారం సాయంత్రం 06.05 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇక మరోవైపు మార్చి 3, 4వ తేదీల్లో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే విశాఖలో జరగబోయే సమ్మిట్ కు మరింత మంది పారిశ్రామిక వేత్తల దృష్టి ఆకర్షించేందుకు ఢిల్లీలో జరగబోయే సదస్సులో వివిధ దేశాల రాయబారులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. మరి విశాఖ కార్యక్రమానికి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఏ మేర పెట్టుబడులు వస్తాయో చూడాలి.
ఢిల్లీ పర్యటన కంటే ముందు పల్నాడులో సీఎం పర్యటన..
కాగా సీఎం జగన్ (Cm Jagan) ఢిల్లీ పర్యటన కంటే ముందు రేపు పల్నాడు జిల్లా వినుగొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా అర్హులైన ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ప్రోత్సాహకం అందనుంది. ఈ పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సాయంతో వారు అవసరమైన పని ముట్లు, పెట్టుబడికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
ఢిల్లీ పర్యటన కీలకం కానుందా?
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సీఎం జగన్ (Cm Jagan) ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ కీలకం కానున్నట్లు సమాచారం. అలాగే పలువురు ఢిల్లీ పెద్దలతో సీఎం భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అపాయింట్ మెంట్ దొరికితే ప్రధాని మోదీ , అమిత్ షాతో సీఎం జగన్ (Cm Jagan) భేటీ కానున్నారని తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Ap cm jagan, AP News, Cm jagan, Delhi