హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన... ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపన

నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన... ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసేందుకు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు.

Andhra Pradesh : ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై లోతైన చర్చలు సాగుతున్న వేళ... ఏపీ సీఎం జగన్... ఆ అంశంపై దృష్టిసారిస్తూనే... మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపైనా ఫోకస్ పెడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా... కడప ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేసేందుకు కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. మూడ్రోజులు అక్కడే పర్యటించనున్న జగన్... ఇవాళ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. యాజ్ యూజువల్‌గా సీఎం పర్యటనపై పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌ ఇదీ :

నేడు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు సీఎం జగన్ శంకుస్ధాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత దువ్వూరు మండలం నేలటూరు దగ్గర మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసి బహిరంగసభలో మాట్లాడతారు. రిమ్స్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. వైఎస్ఆర్ ఉచిత భోజన వసతి భవనం, రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభిస్తారు. సాయంత్రం ఇడుపులపాయకు చేరుకుంటారు.

మంగళవారం సీఎం జగన్... ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ చేరుకొని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పిస్తారు. తర్వాత సీఎం రాయచోటి సభాస్ధలికి వెళ్లి... వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసి, బహిరంగసభలో మాట్లాడతారు. ఇడుపులపాయలో తన ఇంటికి వెళ్తారు.

బుధవారం క్రిస్మస్‌ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో సీఎం జగన్ ప్రార్ధనలు చేస్తారు. పులివెందుల జూనియర్‌ కాలేజీ మైదానంలో కొన్ని అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేస్తారు. వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభిస్తారు. తర్వాత తాడేపల్లి బయలుదేరుతారు. ఇలా సీఎం టూర్ షెడ్యూల్ ఖరారు చేసింది సీఎంఓ.

First published:

Tags: Andhra pradesh news, Andhra updates, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Breaking news, Cm jagan, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu, Ys jagan

ఉత్తమ కథలు