గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్(YS Jagan).. ఈ నెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు గృహ సారథులను కూడా ఈ భేటీలోనే నియమించనున్నారు సీఎం జగన్. పార్టీ సాధించిన విజయాలను ఇంటింటికీ చేర్చటమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ(Ysrcp). ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయ లేదా అన్నది గృహసారథులు పర్యవేక్షిస్తారు. పార్టీ కేడర్ దెబ్బతినకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం జగన్ పలు సూచనలు చేయనున్నారు.
సెకండ్ కేడర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గృహసారథుల కార్యాచరణ ఏంటి, వారితో ఏం చేయబోతున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే గృహసారథుల ఎంపిక పూర్తైంది. దాదాపు 5లక్షలకు పైగా గృహసారథులు(Gruhasaradhulu) రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ 50ఇళ్లకు ఇద్దరు గృహసారథులు ఉండే విధంగా ఒక వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు.
ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా గృహసారథులకు శిక్షణా తరగతులు కూడా నడుస్తున్నాయి. ఇక ఈ నెల 11 నుంచి గృహసారథులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు ప్రతి ఇంటికీ వెళ్లబోతున్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ అనే ట్యాగ్ తో ఉన్న స్టిక్కర్లను అతికించనున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే ఈ స్టిక్కర్లను అతికించనున్నారు. ఈ నేపథ్యంలోనే గృహసారథులు ఎలాంటి కార్యచరణతో ముందుకెళ్లాలి అనే దానిపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న జగన్.. సంక్షేమ పథకాలను ప్రజలకు ముఖ్యంగా లబ్దిదారులకు వివరించే విధంగా గృహసారథులకు సూచనలు చేయనున్నారు.
ఆ వైసీపీ ఎమ్మెల్యేకి ఇక కష్టమే..! ఆయన కూడా డిసైడ్ అయ్యారా..? అంతా ఐ ప్యాక్ పుణ్యమేనా..?
Amaravati: అమరావతిపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. జగన్ సర్కార్‌కు షాక్ ఇస్తుందా ?
మరోవైపు నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైన తరువాత జరుగుతున్న సమావేశాలు కావడంతో.. ఈ భేటీలో సీఎం జగన్ ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తారా ? అనే చర్చ కూడా సాగుతోంది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లోనే కొంతకాలంగా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన రిపోర్టులను వెల్లడిస్తున్న సీఎం జగన్. ఎమ్మెల్యేలకు మొహమాటం లేకుండానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల 13న జరగబోయే సమావేశంలో జగన్ ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.