AP Elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం ఇప్పటికే హీట్ పుట్టిస్తోంది. మరో ఏడాదిన్నరలోపే ఎన్నికలు ఉంటాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) బయటకు చెబుతున్నా..? ముందస్తు ఎన్నికలే ఉంటాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరగాల్సి ఉండగా..? అంతకంటే ముందే 2023 సెప్టెంబర్ లేదా నవంబర్ కంటే ముందే అసెంబ్లీని రద్దు చేసే యోచనలో జగన్ ఉన్నారని సమాచారం అందుతోంది. ఆ వెంటనే ఒకటి రెండు నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. అంటే తెలంగాణ (Telangana) తో పాటు నవంబర్ లోనే ఎన్నికలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs), నియోజకవర్గ ఇంఛార్జులకు పరోక్షంగా సమాచారం ఇచ్చినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇటీవల అధిష్టానం నుంచి.. కొందరి నేతలకు ఫోన్ లు వచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని బూత్ లెవెల్ నేతలు, సమన్వయ కర్తల ఫోన్ నెంబర్లు.. పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎందుకు వారి వివారాలు అడుగుతున్నారని.. నేతలు ఆరా తీయంగా.. ముందుగానే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని చెప్పినట్టు టాక్.
అంతేకాదు ప్రస్తుతం సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు.. చేపడుతున్న కార్యక్రమాలు.. పార్టీ లోనూ.. ప్రభుత్వంలోనే ప్రక్షాళణ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీలో కీలక మార్పులు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులను.. ప్రాంతీయ సమన్వయ కర్తల విషయంలో మార్పులు చేశారు. కీలక నేతలకు బాధ్యతలు ఇచ్చారు. ముఖ్యంగా పార్టీలో వర్గ విబేధాలను.. సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా కొత్తగా ఎన్నికల టీంను రెడీ చేసుకున్నారు.
ఇదీ చదవండి : వైసీపీ ఎన్నికల నినాదం అదే.. కలిసి వస్తున్న మూడు రాజధానుల నిర్ణయం.. ఎంతశాత ప్రభావం
అలాగే పాలన పరంగాను మార్పులు చేశారు. ఇందులో భాగంగానే జవహర్ రెడ్డికి సీఎస్ గా బాధ్యతలు అప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన పదవీ కాలం సైత ఈ డిసెంబర్ నుంచి.. 2024 వరకు ఉంటుంది.. అంటే ఎన్నికల ముగిసి ఫలితాలు వచ్చే వరకు జవహర్ రెడ్డిని కొనసాగించే ఛాన్స్ ఉండడంతో జగన్ ఇతరులను పక్కన పెట్టి ఆయనకు ఓటేసినట్టు సమాచారం. అలాగే నమ్మకస్తులైన అధికారులను కీలక స్థానాలకు బదిలీలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : వైభవంగా పంచమీ తీర్థం.. ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
అయితే ముందస్తుకు జగన్ వెళ్లడానికి కారణాలు ఇవే అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవి ఏంటంటే..? ప్రస్తుతం ప్రజల్లో పాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే విపక్షాలన్నీ ఏకమై.. పదేపదే విషప్రచారం చేస్తే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని.. ఆ వ్యతిరేకత లేకుండా చేయాలి అంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లడం మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: పవన్ పోటీ చేసే ప్లేస్ ఏది..? పిఠాపురమా? భీమవరమా? జనసేనాని మనసులో ఏముంది..?
ప్రస్తుతం మూడు రాజధానాలకు ఉత్తరాంధ్ర, రాయలసీమలో బాగా ఆదరణ వస్తోందని.. ప్రజల్లో ఆ సెంటిమెంట్ ను బలంగా తీసుకెళ్లాలని.. అంటే మూడు రాజధానులు లక్ష్యంగానే ఎన్నికలకు వెళ్తున్నామని చెబుతూ.. సెప్టెంబర్ లేదా నవంబర్ మధ్య చివరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టి.. సభను పూర్తిగా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన తెప్పించుకున్న నివేదికల్లో.. ప్రతిపక్షాలు ఎక్కడా ప్రస్తుతం బలంగా లేవని.. అయితే అన్ని పార్టీలు కలిస్తే.. బలపడే అవకాశం ఉంటుందని నివేదికలు వచ్చినట్టు సమాచారం.. వారికి ఆ అవకాశం ఇవ్వకూడదంటే.. ముందుగానే ఎన్నికలకు వెళ్లడం మంచిదని సీఎం జగన్ముం ముందస్తుకు మొగ్గు చూపుతున్నట్టు టాక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics