AP POLITICS AP CM JAGAN MOHAN REDDY SPECIAL FOCUS ON HINDUPURAM BUT LOCAL YCP LEADERS NOT COOPERATE NGS
Hindupuram: బాలయ్య నియోజకవర్గంపై అధినేత జగన్ ఫోకస్.. స్థానిక వైసీపీ నేతలే బ్రేక్ లు వేస్తున్నారా..?
బాలయ్యపై జగన్ పై ప్లాన్ రివర్స్ అయ్యిందా?
Hindupuram: గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లలో ఇప్పటికే కొంతమంది.. జగన్ కు జై కొ్ట్టారు.. దీంతో మిగిలిన నియోజకవర్గాలపై వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక ఫోకస్ చేశారు. అందులో ముఖ్యంగా టీడీపీ అధినేత నియోజయకవర్గం కుప్పం ఒకటి అయితే.. రెండోది హిందూపురం నియోజకవర్గం.. సీనియర్ హీరో బాలయ్య కంచుకోట అది.. అయితే ఈ సారి అక్కడ ఎలాగైనా నెగ్గాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు.. కానీ అది అంత ఈజీకాదా కారణం ఏంటి?.
Hindupuram: వచ్చే ఎన్నికల నాటికి కొన్ని నియోజకవర్గాలు చాలా ప్రత్యేకం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నా.. కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారు పార్టీ పెద్దలు.. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఇప్పటికే పది నియోజక వర్గాలను టార్గెట్ చేసింది. అందులో మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minster Kodali Nani) , వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi), పేర్ని నాని (Perni Nani), రోజా (RK Roja) లాంటి నేతల నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక వైసీపీ సైతం టీడీపీకి చెందిన కొన్ని కీలక నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నియోజకవర్గం అయిన కుప్పం.. సీనియర్ హీరో బాలయ్య కంచుకోట హిందూపురం లపై అధినేత టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ రెండు నియోజవకర్గ బాధ్యతలను మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి (Peddireddy Ramachandra Reddy) కి అప్పచెప్పారు. ఇప్పటికే ఆయన ఆపరేషన్ కుప్పంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు హిందూపురం బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అయితే అధినేత ఒకటి తలిస్తే.. స్థానిక నేతలు మాత్రం స్పీడ్ బ్రేకర్ ల్లా అడ్డుపడుతున్నారు. ఎందుకంటే హిందూపురం వైస్సార్సీపీలో ముసలం కమ్ముకున్నట్లు ఉంది. నువ్వా నేనా అన్నట్లు ఇరువర్గాలు బాహాటంగా కయ్యానికి కాలుదువ్వుతున్నారు.
సరిగ్గా మూడేళ్ల క్రితం మొదలైన వర్గపోరు ఇప్పుడు చినికి చినికి గాలి వానలా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మహ్మద్ ఇక్బాల్ ప్రస్తుతం MLCగా ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలోని మరోవర్గానికి మధ్య చిన్నపాటి వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ లోలోపల అసమ్మతి రూపంలో ఉన్నా.. ప్రస్తుతం మాత్రం బయటకొచ్చి రోడ్లమీద నిరసనలు చేసే స్థాయికి చేరడంతో పార్టీ సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ హిందుపురంలో ఏం జరుగుతుంది..?
ఈ హిందూపురం వైఎస్సార్సీపీ సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం మాత్రం దొరకడం లేదు.
ఇక్బాల్ నాయకత్వం తమకొద్దనేలా.. ఆఖరికి ఆయన పీఏ కూడా అధికారం చెలాయిస్తున్నాడని ఆరోపణలొస్తున్నాయి. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ.. తమకు ఎలాంటి పనులు కావడం లేదని మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ల వాపోతున్నారు. దీంతో వీళ్లందరూ కలిసి ఓ వర్గంలా ఏర్పడి తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు.
మొన్నామధ్య బెంగళూరు సమీపంలో సమావేశమై తమ నియోజకవర్గ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. తర్వాత నియోజకవర్గంలోనే ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు తెలిసే విధంగానే హిందూపురంలోనే చర్చలు పెట్టుకున్నారు. ఆ చర్చల తర్వాత ఓ నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.
హిందూపురంలో ప్రతిరోజు ఈ వర్గపోరు గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మొన్నామధ్య అయితే ఎంపీపీ రత్నమ్మ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టగా.. ఇక్బాల్ వర్గీయులు అడ్డుకున్నారు. వాళ్లను అడ్డుకోబోయిన కౌన్సిలర్ ఇర్షాద్‌పై సైతం దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :: టీడీపీ ప్రధాన టార్గెట్ ఆ పదిమంది లీడర్లేనా..? అంత పర్సనల్ ఎందుకయ్యారు ..? కారణం ఏంటి..?
అక్కడ అంత రణరంగం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై అసమ్మతి వర్గం ఆరోపణలు చేసింది. అదే రోజు సాయంత్రం నేరుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎంట్రీతో పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఓవైపు వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు చెక్ పెట్టాలని అధినత ఆలోచన చేస్తుంటే.. స్థానిక నేతలు.. వర్గ పోరుతో.. కేడర్ ను గందరగోళంలోకి నెడుతున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.