హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: విశాఖ నుంచి ఇక పాలన.. డేట్ ఫిక్స్ చేశారా? సీఎం జగన్ ఎన్నికల ప్లాన్ అదే?

CM Jagan: విశాఖ నుంచి ఇక పాలన.. డేట్ ఫిక్స్ చేశారా? సీఎం జగన్ ఎన్నికల ప్లాన్ అదే?

AP CM YS Jagan

AP CM YS Jagan

CM Jagan: ఏపీ మూడు రాజధానులు తప్పవని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు.. కానీ అధి సాధ్యమేనా.. అసలు జగన్ మనసులో ఉన్న ప్లాన్ ఏంటి..? త్వరలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా..? ఇకపై నుంచి విశాఖ నుంచి పాలన చేయాలి అనుకుంటున్నారా.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారా..?

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18, Visakhapatnam. 

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడగులు వేస్తోందని వైసీపీ (YCP) వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆ నిర్ణయాన్ని అమలు చేయడానలి నిర్ణయించారా..? దానికి సబంధించి ఇప్పటికే డేట్.. టైం ఫిక్స్ చేశారా.. పార్టీలో కీలక నేతలకు దానిపై సమాచారం కూడా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ప్లీనర్ గ్రాండ్ సక్సెస్ తరువాత.. వైసీపీ అధినేత జగన్ మరింత దూకుడు పెంచాలని.. భారీ విజయం లక్ష్యంగా పావులు కదుపుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పార్టీ కేడర్ లో స్థైర్యాన్ని నింపే చర్యలపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ప్లీనరీ నుంచే ఆయన ఎన్నికల సమర శంఖం పూరించారు కూడా. అదే రోజు ఆయన నవంబర్ నుంచి బస్సు యాత్రకు సిద్ధమయినట్టు శ్రేణులకు సమాచరం ఇచ్చారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు. అది ఏంటంటే.. ఇకపై విశాఖ (Visakha) నుంచి పాలనను ప్రారంభిస్తారని క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

అదికూడా ఎంతో దూరం లేదని.. ఈ ఆగస్టు నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తారని.. వచ్చె నెల నుంచి ఎన్నికల వరకు ఆయన పాలన వ్యవహారాలన్నీ విశాఖ నుంచే చూస్తారంటూ ప్రచారం ఉంది. అయితే అలా అని మూడు రాజధానులు ప్రకటించి పాలన చేయడం కాదని తెలుస్తోంది. కేవలం సీఎం క్యాంపు ఆఫీసు (CM Camp Office) ను మాత్రమే.. మార్చి పాలన అందిస్తారని సమాచారం.

దీనికి తోడు న్యాయపరంగా.. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఇప్పటికే అన్ని పరిశీలించారని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ఆగస్గులోనే విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసి వారానికి ఐదు రోజుల పాటు పాలనను అక్కడ నుంచే పరుగులు పెట్టిస్తారని టాక్. శ్రావణమాసం కావడంతో ముహూర్తాలు అధికం. అందులో మంచి ముహూర్తం చూసుకొని జగన్ విశాఖలో అడుగుపెట్టనున్నారుట. ఆ డేట్ టైం కూడా ఫిక్స్ అయ్యిందని.. అది కేవలం కీలక నేతలకు మాత్రమే తెలుసు అంటున్నారు.

ఇదీ చదవండి : కొడుకు కోసం ఖరీదైన కారు.. కలెక్షన్ క్వీన్ అంటూ టీడీపీ రచ్చ.. వైసీపీ వెర్షన్ ఏంటంటే?

ప్రభుత్వం తాజా నిర్ణయంతో మళ్లీ అమరావతి పై నీలి నీడలు కమ్మినట్టే.. గతంలోనే మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలను న్యాయ రాజధానిగా ప్రకటించారు. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్ణయం పెను వివాదస్పదమైంది. అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్ని రాజకీయ పక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఉద్యమం ఎగసిపడింది. సుదీర్ఘ కాలం సాగింది. కోర్టులో వివాదాలు సైతం నడిచాయి. చివరకు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఇదీ చదవండి : వరదలను ఎలా కొలుస్తారా.? హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు.. టీఎంసీ, క్యూ సెక్కుల లెక్క ఏంటి?

అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో వసతులకల్పన అనివార్యంగా మారింది. కోర్టు తీర్పుతో చేసిది ఏమీ లేక.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజధాని భూములను విక్రయించడానికి సిద్ధమైంది. అక్కడి కట్టడాలను, భవనాలను అద్దె రూపంలో ఆదాయం సమకూర్చుకునేందుకు నిర్ణయించింది. అయితే అమరావతిలో కోర్టు ఆదేశాలతో చిన్నచిన్న పనులు చేస్తున్న ప్రభుత్వం మనసు మాత్రం విశాఖపైనే ఉందంటున్నారు. కానీ న్యాయ చిక్కులు ఎదురుకాకుడదు అంటే.. రాజధాని పేరు చెప్పకుండా.. విశాఖ లో సీఎం కార్యాలయం పెడితే ఎలాంటి ఇబ్బంది రాదు అని భావిస్తున్నారని సమాచరం.

ఇదీ చదవండి: వీడు మామూలోడు కాదు.. వీధికో భార్య.. ఒకరికి తెలియకుండా ఒకరితో పెళ్లి.. 11మందితో కాపురం..

ప్రస్తుతం జగన్ పై ఉన్న అతి విమర్శల్లో రాజధాని లేకుండా పాలన చేస్తున్నారన్నది ఒక్కటి.. అయితే వచ్చే ఎన్నికల్లో దానికి తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఎలాగోలా విశాఖ నుంచి పాలనను ప్రారంభించాలని భావిస్తోంది. తద్వారా తన మాటను నిలబెట్టుకోవడంతో పాటు రాజధానిగా విశాఖలో బీజం వేసినట్టేనని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Vizag

ఉత్తమ కథలు