Cm Jagan: దేశ చరిత్రలోనే అమరావతి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉందని సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా ఎన్నో కుట్రలు చేశారన్న జగన్..పేదలకు ఇళ్లు రాకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారన్నారు. కానీ పేదల ఇళ్ల పంపిణీపై సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించామని సీఎం తెలిపారు. అమరావతి ఇక సామాజిక అమరావతి అవుతుందని..అమరావతి మనందరి అమరావతి అవుతుందని జగన్ (Cm Jagan) వ్యాఖ్యానించారు.
ఇక మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్న జగన్ (Cm Jagan)..సుమారు రూ.7 నుంచి రూ.10 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని అందజేస్తున్నామన్నారు. 50 వేల 793 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నాం. సొంతంగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.లక్ష 80 వేలు అకౌంట్లో వేస్తామని..లేదా ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని..లేకపోతే ఇంటి నిర్మాణ సామాగ్రి కోసం ఖర్చును ఖాతాలో వేస్తామని జగన్ (Cm Jagan) అన్నారు. జులై 8న వైఎస్సార్ జయంతి రోజు నుంచి ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. వారం పాటు ఇళ్ల పండుగ కార్యక్రమం జరుగుతుందన్నారు. మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు.
ఇక ఇంటి నిర్మాణం కోసం ఇసుకను ప్రభుత్వమే పూర్తి ఉచితంగా ఇస్తుంది. మొత్తం 3 విధానాల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రెండో విధానంలో ఇంటి నిర్మాణ కూలి మొత్తాన్ని డబ్బు మొత్తాన్ని ఇస్తామన్నారు. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలా చేశారా? టీడీపీ హయాంలో టిడ్కొ ఇళ్లు పూర్తయితే ప్రజలు జగన్ ను ఎందుకు ఆధరిస్తారని సీఎం ప్రశ్నించారు. అందుకే గతానికి ఇప్పటికీ తేడా చూడండి. చంద్రబాబు హయాంలో సెంటు భూమి కూడా పేదలకు ఇచ్చిన పాపాన పోలేదు. ఇళ్ల నిర్మాణ విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు వాగ్దానాలతో చంద్రబాబు మోసం చేశారు. ఎప్పుడైనా మోసం చేసే వారిని నమ్మకండి. నరకాసూరుడినైనా నమ్మవచ్చు. కానీ నారా చంద్రబాబు నాయుడిని నమ్మలేం అని జగన్ (Cm Jagan) ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఎక్కడా లంచాలు, వివక్షలు లేవన్నారు. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భావించామని..ఆర్ధిక సవాళ్లు ఎన్ని వచ్చిన వెనక్కి తగ్గలేదన్నారు. ఇప్పటివరకు 3 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో వేశామన్నారు. ఈ రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుందన్న జగన్..మంచి చేస్తుంటే చంద్రబాబు తట్టుకోవడం లేదన్నారు. పెత్తందారులంతా ఏకమై పేదవారిపై దాడి చేస్తున్నారని జగన్ పంచుల వర్షం కురిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Ap, Ap cm jagan