హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: కేసీఆర్ ప్రకటనతో జగన్ పై ఒత్తిడి..! ఏపీ సీఎం వ్యూహంపై సస్పెన్స్.. ఆ మాట గుర్తుచేస్తున్న ప్రతిపక్షాలు

YS Jagan: కేసీఆర్ ప్రకటనతో జగన్ పై ఒత్తిడి..! ఏపీ సీఎం వ్యూహంపై సస్పెన్స్.. ఆ మాట గుర్తుచేస్తున్న ప్రతిపక్షాలు

పొరుగున తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే.. ఖచ్చితంగా ఏపీలో రియాక్షన్ ఉంటుంది. బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన.. ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ను డిఫెన్స్ లోకి నెట్టింది.

పొరుగున తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే.. ఖచ్చితంగా ఏపీలో రియాక్షన్ ఉంటుంది. బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన.. ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ను డిఫెన్స్ లోకి నెట్టింది.

పొరుగున తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే.. ఖచ్చితంగా ఏపీలో రియాక్షన్ ఉంటుంది. బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన.. ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ను డిఫెన్స్ లోకి నెట్టింది.

  Anna Raghu, Guntur, News18­

  ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వంట నూనెల ధరలు పెరిగాయి. మరి పొరుగున తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే.. ఖచ్చితంగా ఏపీలో రియాక్షన్ ఉంటుంది. బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన.. ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ను డిఫెన్స్ లోకి నెట్టిందన్న చర్చ జరుగుతోంది. కొత్త ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడం ఒకింత జగన్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఏపీలోని నిరుద్యోగులు ఆయన్ను అభినందిస్తూ ఫోటోకు పాలాభిషేకం కూడా చేశారు. ఐతే కేసీఆర్ ను అభినందిస్తూనే జగన్ పై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

  ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు సీఎం జగన్ వాగ్దానం చేశారు. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఆ హామీని జగన్ నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని కోరుతున్నారు.

  ఇది చదవండి: ఏపీ రాజధాని విశాఖే.. అక్కడే అందరికీ స్థలాలు... విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

  ఐతే అసలే ఆర్ధిక సమస్యలతో ఉన్న ఉద్యోగులకే జీతాలు చెల్లించటానికి నానా తంటాలూ పడుతున్న జగన్ సర్కార్ కు కె.సి.ఆర్ ప్రకటనతో కొంతమేర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పటి నుండో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారు ఉద్యమాలు చేసినా వారిని ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ప్రభుత్వం వచ్చాక కొత్తగా సచివాలయం సిబ్బందిని నియమించినా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వారిని ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదు.

  ఇది చదవండి: అదో పెద్ద కామెడీ.. సీఎం జగన్-టాలీవుడ్ రిలేషన్ పై జనసేన కామెంట్..!

  రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ ఉద్యోగాలు తప్పించి సాధారణ ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్దగా రాలేదు. గత ఏడాది 10వేల ఉద్యోగాలతో క్యాలెండర్ రిలీజ్ చేసినా దానిపై విమర్శలు వచ్చాయి. ఖాళీలు ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఆయా శాఖలలో ఉద్యోగులపై పనిభారం పెరగడమే గాక, ఆయా శాఖల పనితీరుపై విపరీతమైన ప్రభావం పడుతుంది.

  ఇది చదవండి: ఏపీ స్కూళ్లలో కొత్త కాన్సెప్ట్.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..

  అన్నీ తెలిసినా కొత్త ఉద్యోగాలను భర్తీ చేసే ఆర్ధికస్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది కాదనలేని సత్యం. కేసిఆర్ ప్రకటనతో ఏపీలో కూడా కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ రాజకీయపార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి ప్రజలను మళ్ళించే పనిలోపడ్డాయి. ఇటువంటి సమయఃలో నిరుద్యోగులకు ఊరట కల్పించకపోతే రానున్న ఎన్నికల్లో అధికారపార్టీకి ఇబ్బందులు తప్పని పరిస్థితి.

  ఇది చదవండి: ఆంధ్రా హోటళ్లలో పూరీ, బజ్జీ బంద్.. కారణం ఇదే..!

  ఐతే ఈ విషయంలో వైసీపీ నేతలు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ కనిపిస్తుందిగానీ.. తమ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల రూపంలో ఏకంగా 4లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్రకటనతో జగన్ సర్కార్ కు నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తప్పేలా లేదు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు