Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM JAGAN AND PM MODI MEETING END THEY DISCUSS MORE THAN ONE HOUR THESE ARE THE ISSUES NGS

CM Jagan PM Modi: ప్రధానితో ముగిసిన సీఎం జగన్ సమావేశం.. ఎంత సేపు.. ఏఏ అశాలపై చర్చించారంటే

ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం

ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం

CM Jagan PM Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఇద్దరు సుమారు గంటకుపైగా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు ప్రధానంగా ఆ అంశంపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.

    CM Jagan meeting with PM Modi: ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఢిల్లీ పర్యటన (Delhi  tour) బిజిబిజీగా సాగుతోంది. ఇప్పటికే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. సుమారు గంటకుపైగా సాగిన ఈ భేటీలో.. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ, జగన్ మధ్య గంటకు పైగా చర్చ జరిగింది. ఏపీ అభివృద్ధి అంశాలను ప్రధానితో జగన్ ప్రస్తావించారు. ఏపీకి ఆర్థిక చేయూత, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా రాష్ట్రనికి సంబంధించి నిధులు, పెండింగ్ సమస్యలతో పాటు.. రాజకీయ పరిణామాల గురించి కూడా ప్రధానికి జగన్ వివరించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రపతి, ఉప రాష్ట్ర ప్రతి ఎన్నిక విషయంలో కూడా ప్రధానికి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం.  వీటితో పాటు ఏపీలో జిల్లాల పునర్విభజన అంశాన్ని కూడా వివరించారు. అలాగే మూడు రాజధానులకు సైతం సహకరించాలని కోరినట్టు సమాచారం. దీంతో పాటు త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపడుతున్న అంశాన్ని కూడా ఆయన కు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో నిధులు విడుదల చేయించేలా సాయం చేయాలని కోరినట్టు తెలుస్తోంది.

    ప్రధానితో భేటీ ముగియడంతో.. ప్రస్తుతం సీఎం జగన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తో సమావేశం అయ్యారు.. ఆ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది..

    ఇదీ చదవండి : విశాఖలో భూముల కబ్జా ఆరోపణలకు కారణం ఆయనే..? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

    ముఖ్యంగా నిర్మలా సీతారమన్ తో సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు.. రెవిన్యూ లోటు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆ తరువాత అంటే రాత్రి 9:30గంటలకు హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. ఆయనతో పలు రాజకీయ అంశాలు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతల తీరు.. పొత్తులపై చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. పవన్ టీడీపీతో కలిసి వెళ్తారనే ఊహాగానాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలో కొత్తగా 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కోరే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి : సీఎం జగన్ ఢీల్లీ పర్యటనకు కారణం ఇదే.. వైరల్ అవుతున్న ట్విటర్ పోల్.. మీ అప్షన్ ఏంటి అంటూ ప్రశ్న

    అయితే  సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఏ ఉద్దేశంతో అయినా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. పేలని సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకు అంటూ ఆయన ట్విట్టర్ లో  పోల్ పెట్టారు.. అందుకు నాలుగు ఆప్షన్లు కూడా పెట్టారు.. దీనిపై వైసీపీ నేతలు సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Amit Shah, Andhra Pradesh, Ap cm jagan, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు