హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వీవీప్యాట్ల లెక్కించమంటే మీ అభ్యంతరాలేంటి... ఈసీపై చంద్రబాబు ఫైర్

వీవీప్యాట్ల లెక్కించమంటే మీ అభ్యంతరాలేంటి... ఈసీపై చంద్రబాబు ఫైర్

చంద్రబాబునాయడు(ఫైల్ ఫోటో)

చంద్రబాబునాయడు(ఫైల్ ఫోటో)

50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని గట్టిగా పట్టుబడతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లెక్కింపు ఆలస్యం అవుతుందని ఈసీ చెప్పడం తప్పించుకోవడమేనంటూ ఆరోపించారు.

వీవీ ప్యాట్లపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో... సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. సమయం పట్టిన పారదర్శకత ముఖ్యమన్నారు సీఎం. కానీ మా పోరాటం మాత్రం ఆగదన్నారు. మా పోరాటం వల్లే ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చింనద్నారు. వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కిచండంలో ఈసీకి ఉన్న అభ్యంతరాలేంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై త్వరలోనే ఈసీని కలుస్తామన్నారు. 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని గట్టిగా పట్టుబడతామన్నారు. లెక్కింపు ఆలస్యం అవుతుందని ఈసీ చెప్పడం తప్పించుకోవడమేనంటూ ఆరోపించారు చంద్రబాబు. అంతకుముందు విపక్ష నేతల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సంఘ్వి కూడా కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై 22 పార్టీలతో కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికలకు 75 రోజులు సమయం తీసుకోగా లేనిది.. స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల కేటాయిస్తే ఇబ్బంది ఏమిటి అని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వస్తే 100శాతం లెక్కించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ విపక్షాలతో కలిసి చంద్రబాబు వేసిన పిటిషన్‌పై సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలింది. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చేసింది.

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Chandrababu Naidu, Supreme Court, Vvpat

ఉత్తమ కథలు