హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

English Minster: ఆ మంత్రికి తెలుగురాదా? రిటైర్మెంట్ తీసుకో అంటూ జగన్ సీరియస్ అయ్యారా..? ఎవరా మంత్రి?

English Minster: ఆ మంత్రికి తెలుగురాదా? రిటైర్మెంట్ తీసుకో అంటూ జగన్ సీరియస్ అయ్యారా..? ఎవరా మంత్రి?

జగన్ కేబినెట్ లో ఆ మంత్రికి తెలుగు రాదా..?

జగన్ కేబినెట్ లో ఆ మంత్రికి తెలుగు రాదా..?

English Minster: సీఎం జగన్.. కేబినెట్ లో కొందరి మంత్రులపై ఎందుకు ఫైర్ అయ్యారా..? ఆయన సీరియస్ అయిన ఆ మంత్రులు ఎవరు.. అందులో ఓ కీలక మహిళా మంత్రి కూడా ఉన్నారా..? అది కూడా ఆమె తనకు.. తెలుగు రాదని చెప్పడంతో.. రిటైర్మెంట్ తీసుకోమని జగన్ సీరియస్ అయ్యారా..? అసలు ఎవరా మంత్రి..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  English Minster: ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కొందరి మంత్రుల తీరుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)  సీరియస్ అయ్యారు. విపక్షాల విమర్శలు తిప్పికొట్టలేనప్పుడు మంత్రి పదవుల్లో ఉండడం ఎందుకు..? తప్పిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఓ  మంత్రిపై సీరియస్ అయ్యారా..? ఆ మంత్రికి తెలుగు రాదా? ఇంగ్లీష్ మాత్రమే వస్తుందా? అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నారా? మరి తెలుగురాని మంత్రులు కేబినెట్‌లో ఎందుకు.. రిటైర్మెంట్‌ తీసుకోండి అని సీఎం .. ఘాటుగా మండిపడ్డారా..? మరి ఇంతకీ కేబినెట్ లో తెలుగు రాని ఆ మంత్రులు ఎవరు..? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ వీటిపై విమర్శలు ఆగడం లేదు. విపక్షాలైతే ఓ రేంజ్ లో జగన్ పై సెటైర్లు పేల్చుతున్నాయి.. ప్రతిసారి మంత్రులను మార్చడం ఎందుకు.. గజన్ నే మర్చితే సరిపోతుంది కదా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సెటైర్లే వేశారు. ఇక సోషల్ మీడియా (Social Media) లోనూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి..

  కేవలం విపక్షాలనే కాదు.. సొంత పార్టీలోనూ జగన్ వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులు సహజంగానే స్పందిస్తారు. స్పందించకుండా.. తమకు సంబంధం లేదు అనుకునే మంత్రులను సీఎంవో, పార్టీ హెడ్‌క్వార్టర్‌ ఎప్పటికిప్పుడు అలర్ట్‌ చేస్తుంటుంది. ఇన్‌పుట్స్‌ ఇచ్చి మీడియా ముందుకు రావాలని చెబుతూ ఉంటుంది.. అయితే అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలు, సీఎంవో అధికారుల నుంచి ఆ మంత్రికి ఆదేశాలు వెళ్తున్నాయి.

  కానీ తనకు తెలుగు రాదు.. ఇంగ్లీష్‌ మాత్రమే వచ్చు.. ఇంగ్లీష్‌లోనే మాట్లాడగలను అని సాకులు చెప్పినట్టు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం జగన్‌ తెలుగురాని మంత్రులు కేబినెట్‌లో ఎందుకు రిటైర్మెంట్‌ తీసుకోండి అని ఫైర్ అయినట్టు టాక్.. ఆ పార్టీ వర్గాల్లో ఆ తెలుగు రాని మంత్రి ఎవరు అన్నదానిపైనే చర్చ జరుగుతోంది. మీడియాకు ముఖం చాటేసిన మంత్రుల జాబితా.. మంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలు.. ఆరోపణలపై స్పందించకుండా మౌనం వహిస్తున్న మంత్రుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో చక్కర్లు కొడుతున్నాయి.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కేబినెట్ లోకి మళ్లీ మాజీలు.. ఆ ఇద్దరికీ బెర్త్ లు ఫిక్స్..? ముహూర్తం ఎప్పుడు?

  కొంతమంది కొత్త మంత్రులు కాగా.. మరికొంత మంది రెండో దఫా కేబినెట్‌లో కొనసాగుతూ.. శాఖా పరంగా ప్రమోషన్‌ పొందినా సైలెంట్‌ అయిపోయిన వారి పేర్లు ఉన్నట్టు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఇంగ్లీష్.. వింగ్లీష్ మంత్రి ఎవరు? గతంలో టీడీపీ వంటి పార్టీ నుంచి వచ్చి.. సీరియస్‌గా విమర్శలు చేయకుండా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తోంది ఎవరు అనే చర్చ నడుస్తోందట.

  ఇదీ చదవండి : దేశంలోనే రెండో అతి పెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. ఎలా చేశారో చూడండి

  భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా అతి జాగ్రత్తలు పడుతున్నారా? లేక అధికారం, హోదా ఉంది.. సైలెంట్ తమపని తాము చేసుకోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారా..? అంతకుముందు కేబినెట్‌లో బెర్త్‌ కోసం నానా హడావిడి చేసిన కొందరు.. పదవి రాగానే ఎక్కడాలేని పెద్దరికం చూపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మిగిలిన ఆరోపణల సంగతేమోకానీ.. సీఎం జగన్‌ ఫ్యామిలీ మీద వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో కూడా సదరు మంత్రులు సేమ్‌ ఫార్ములాను వాడటంతో అధినేతకు కోపం తెచ్చిపెట్టింది అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, AP Politics

  ఉత్తమ కథలు