AP POLITICS AP CABINET FINAL THE NAME OF KONASEEMA DISTRICT AS KONASEEMA AMBEDKAR KONASEEMA NGS
AP High Court: కోనసీమ అల్లర్ల పిటిషన్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. అంబేద్కర్ కోనసీమ పేరు ఫైనల్ చేసిన కేబినెట్
Konaseema Violence
Konaseem Riots: కోనసీమ అల్లర్ల ఘటనపై దుమారం ఆగడం లేదు. ఈ పిటిషన్లపై ఇటు హైకోర్టు సీరియస్ అయ్యింది. 50 లక్షల ఫైన్ వేస్తామంటూ హెచ్చరించింది కూడా మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరును ఏపీ కేబినెట్ ఫైనల్ చేసింది.
AP High Court: కోనసీమ జిల్లా (Konaseema District) పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (BR Ambedkar Konaseema District) గా మారుస్తూ జగన్ ప్రభుత్వం (Jagan Government) తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. ఆ నిరసనలు పెను హింసాత్మకంగా కూడా మారాయి. కోనసీమ జిల్లా పేరు మార్పునకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల కారణంగా పెట్టిన 144 సెక్షన్ ఇంకా కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కేసులు.. విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా కోనసీమలో చోటు చేసుకున్నఅల్లర్లపై సిట్టింగ్ జడ్జి (Sitting Judge) తో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు (High court) లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపి.. కొట్టివేసింది. అంతేకాదు పిటిషనర్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి పిటిషన్లు వేస్తే.. 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని పిటిషనర్ ను హెచ్చరించింది కోర్టు. దీంతో పిటిషనర్ న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు.
మరోవైపు కోనసీమ జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ఈ అంశంలో ఎవరికైనా ఇంకా అభ్యంతరాలున్నా నెల రోజుల లోపల తెలపాలని గడువు పెట్టింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని గత నెల 24 న అమలాపురం లో ఆందోళనకారులు చేసిన విధ్వంసంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లతో పాటు కొన్ని బస్సులు దహనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.
మొన్నటి అల్లర్లకు సంబంధించిన విచారణ సైతం ఇంకా కొనసాగుతూనే ఉంది. అల్లర్లలో పాల్గోన్న 258 మందిని పోలీసులు గుర్తించి 217 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మైనర్లు ఉన్నారు. మిగిలిన వారిని పట్టుకోటానికి ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నాయి. కోనసీమ అల్లర్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటికీ 144 సెక్షన్, 30వ సెక్షన్ అమలులో ఉన్నాయి.
గతనెల 24 నుంచి 15 రోజుల పాటు 16 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జిల్లా పేరు మార్పు అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 13 వేల మందితో జిల్లా వ్యాప్తంగా గస్తీ నిర్వహిస్తోంది. ఇప్పటికే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.