AP POLITICS AP CABINET FINAL LIST READY CM JAGAN KEY CHANGES IN LAST MINUTE HE MEET WITH SAJJALA AND OFFICIALS NGS
AP Cabinet Final List: కేబినెట్ కూర్పు చివరి నిమిషంలో ట్విస్ట్.. సజ్జల, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ..
సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
AP Cabinet Final List: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కసరత్తు తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది. తుది జాబితా సిద్ధమైంది అనుకుంటున్న సమయంలో.. సీఎం జగన్ చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు సమాచారం. మరోసారి ఆయన సజ్జలతో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది.
AP Cabinet Final List: గత మూడు రోజులుగా సీఎం జగన్ (CM Jagan) తన కేబినెట్ కూర్పుపై కసరత్తూ చేస్తూనే ఉన్నారు.. కొత్త మంత్రుల (New Minster list) ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడంతో.. ఇప్పటికే గవర్నర్ కు కొత్త మంత్రుల జాబితా పంపించాల్సి ఉంది. అయితే తాజా పరిణామాలు.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో సీఎం జగన్ కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఆ జాబితా అధికారికంగా బయటకు రానుంది. తాజా మార్పులు చేర్పులుపై.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy).. సీఎంవో అధికారులతో జగన్ సమావేశం అయ్యారు. చివరి నిమిషంలో జరుగుతున్న మార్పులపై వారితో చర్చిస్తున్నారు. ఆ కసరత్తు పూర్తి అయిన వెంటనే.. జీఏడీ అధికారులతో సీల్డ్ కవర్ లో ఆ జాబితాను గవర్నర్ కు పంపించనున్నారు. గవర్నర్ ఆమోదం తరువాత.. సీఎంఓ కార్యాలయం నుంచి కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులకు ఫోన్ లు వెళ్తాయి.. అప్పుడే అధికారికంగా జాబితా బయటకు వస్తుంది.. ః
నిన్న రాత్రికే కొత్త మంత్రుల విషయంలో సీఎం జగన్ లిస్ట్ ఫైనల్ చేశారని ప్రచారం జరిగింది. పాత వారిలో పది మందికి.. కొత్త వారిలో 15 మందికి అవకాశం కల్పించినట్టు సమాచారం. అంతే సీఎం జగన్ తో కలిసి మొత్తం కేబినెట్ సంఖ్య 26 గా ఉండనున్నట్టు తెలుస్తోంది. మంత్రులుగా ఎవరెవరు ఉంటారు అన్నది సీఎం నిన్ననే ఫైనల్ చేసినా.. సజ్జల చెప్పిన సూచనలు, ఇతర నివేధికల ఆధారంగా ఆయన చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం.
సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఎంపిక జరిగినట్టు సమాచారం. అలాగే బడుగు బలహీన వర్గాలకే అధికంగా అవకాశం ఇచ్చినట్టు వైసీపీ వర్గాల టాక్. కేబినెట్ లిస్ట్ లో సామాజిక న్యాయానికే ఆయన పెద్ద పీట వేశారని చెబుతున్నారు. అనుభవం ఉందని కొందరిని, కుల సమీకరణల ఆధారంగా మరికొందర్ని ఎంపిక చేసినట్టు టాక్..
మరోవైపు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యే ఇంటి దగ్గర సంబరాలు మొదలయ్యాయి. కేబినెట్ బెర్త్ ఖరారు అయ్యింది అంటూ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotam Reddy Sridhar Reddy) ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్న అభిమానులు సందడి చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమైంది అంటున్నారు. అయితే ఇంకా అధికారికంగా సమచారం అందలేదని.. అన్నీ ఊహాగానాలు మాత్రమే అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అనకాపల్లిలో గుడివాడ అమర్ నాథ్ (Gudiwada Amarnath) ఇంటి దగ్గర కార్యకర్తలు హంగామా చేస్తున్నారు. ఇటు శ్రీకాకులంలో ధర్మాన ప్రసాద రావు (Darmana Prasad Rao) అభిమానులు ఫ్లెక్సీలు కూడా కట్టేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎవరూ తమకు సమాచారం అందలేదు అంటున్నారు. అయితే కాసేపట్లో సీఎంఓ నుంచి అధికారికంగా జాబితా వెలువడనుంది..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.