Anna Raghu, News18, Guntur
AP Cabinet Update: వైసీపీ (YCP) ఎమ్మెల్యేలను ఊరిస్తున్న మంత్రి వర్గ విస్తరణరకు సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) ముహూర్తం ఫిక్స్ చేశారు. మంత్రివర్గంలో ఉండేదెవరు.. పదవిని కోల్పోయేదవరనే దానిపైనే అధిష్టానం దగ్గర క్లారిటీ ఉన్నా.. వారికి మాత్రం ఒకరోజు ముందుగానే సమాచారం అందిస్తారని తెలుస్తోంది. పనితీరు, సమర్ధత, సామాజిక వర్గాలు, జిల్లాల సమీకరణాలు ఇలా అన్ని లెక్కల తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy ) ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల టాక్. కేబినెట్ విస్తరణకు డేట్ ఫిక్స్ చేసిన సీఎం జగన్.. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ ను కలవాలి అని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ రోజే కొత్త కేబినెట్ ఏర్పాటుపై ఆయనకు పూర్తి వివరాలు అందిస్తారని సమాచారం..
మంత్రి పదవి రెండున్నరేళ్లకే పరిమితమని చెప్పిన జగన్ .. కాస్త ఆలస్యమైనా ఏప్రిల్ నెలలోనే ఈ తతంగం పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. 8వ తేదీన గర్నవర్ కలిసిన తరువాత.. ఏప్రిల్ 11వ తేదీన ఆయన అపాయింట్ మెంట్ కోరనున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే అదే రోజు కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. అదే రోజు మంత్రులకు సీఎం విందు ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే కరోనా కష్ట సమయంలోనూ తనకు అండగా ఉన్నందుకు మంత్రులకు ఆయన అదే రోజు ధన్యావాదాలు చెబుతారని తెలుస్తోంది.
ఏప్రిల్ 8వ తేదీనే గవర్నర్ ను కలుస్తున్నా.. ప్రస్తుత మంత్రుల్లో ఉండేది ఎవరు..? ఎవరితో రాజీనామా చేయిస్తారు..? కొత్తగా మంత్రులుగా ఎవరికి అవకాశం కల్పిస్తున్నారన్నది అప్పటి వరకు అంతా సస్పెన్ష్ గానే ఉంచనున్నారు.. 11వ తేదీకి ఒక్క రోజు ముందు మాత్రమే అందరికీ సమాచారచం ఇస్తారని సీఎం వర్గాల మాట.. అయితే మంత్రులను పదవి నుంచి తప్పించినా.. ఎవరూ నిరుత్సాహ పడవద్దని.. కచ్చితంగా అందరికి సముచిత స్థానం కల్పిస్తానని సీఎం స్పష్టమైన హామీ ఇవ్వనున్నారు. సీనియర్లను గౌరవించి వారికి.. పార్టీ పరమైన బాధ్యతలు అప్పచెబుతామని.. 2024 ఎన్నిలకు ముందు పని తీరు ఆధారంగానే వారికి ఫలితం ఉంటుందని స్పష్టంగా చెప్పనున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి : ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలి.. లోక్ సభలో ఎంపీ డిమాండ్
అయితే ముందుగా ఐదుగుర్ని మంత్రులుగా కొనసాగించి.. అందర్నీ తప్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం మేరకు ఇద్దరు మినహా అందరితో రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు సామాజిక సమీకరణాలే కారణమని వైసీపీ వర్గాల టాక్. అప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తవుతుంది కాబట్టి.. ఆయా జిల్లాల వారిగానే మంత్రుల లెక్కలు ఉంటాయని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News