Home /News /andhra-pradesh /

AP POLITICS AP CABINET EXPAND CM JAGAN WILL MEET ONE TO ONE WHO WILL EX MINSTERS IN HIS CABINET NGS

AP Cabinet: మాజీలు కానున్న మంత్రులతో వన్ టు వన్ సీఎం భేటీ.. ఎప్పుడు.? ఏం చెప్పబోతున్నారంటే..?

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఏపీ కేబినెట్ (ఫైల్)

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో మాజీలు కాబోతున్నది ఎవరు.. రెండో ఛాన్స్ దక్కించుకోనున్నది ఎవరూ.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ.. అయితే దీనిపై పూర్తి క్లారిటీతో ఉన్న సీఎం జగన్.. మాజీలు కాబోతున్న మంత్రులతో వన్ టు వన్ సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఆ సమావేశంలోనూ అసలు ఎందుకు తప్పించాల్సి వచ్చింది? ఏం చేయాలి అనుకుంటున్నది జగన్ వారికి క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇంకా చదవండి ...
    AP Cabinet Reshuffle:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు (AP Cabinet Reshuffle) సమయం దగ్గర పడుతోంది. ఈ వారంలోనే  మంత్రులుగా ఎవరుంటారు.. ఎవరు పదవులు కోల్పోతారనే దానిపై క్లారిటీ రానుంది.  జిల్లాల వారీగా మంత్రులెవరనేదానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.  దీనిపై సీఎం జగన్ (CM Jagan) మాత్రం పూర్తి క్లారిటీ ఉన్నారు.  అంతేకాదు తన మనసులో ఏముంది.. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేయాల్సి వస్తోంది.  ఒకరిద్దర్ని కూడా ఎందుకు కొనసాగించాల్సి వస్తోంది.. ఇలా అన్ని విషయాల్లో మంత్రులకు ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే 2024 ఎన్నికల్లో ఏ అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలి.. ప్రతిపక్షాలను ఎదుర్కొనాలి.. ఇలా అన్ని విషయాల్లోనే సీఎం జగన్ మంత్రులకు.. కొత్త ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నారు. 

    ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. కానీ ఎవరి పదవి ఊడిపోతుంది..? కేబినెట్‌లో మిగిలేది ఎవరు? మాజీలు అయ్యేది ఎంత మంది? కొత్తగా పదవి దక్కించుకునేది ఎవరు? అన్నదిపై వైసీపీ నేతలకు పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. సీఎం జగన్ కు అంత్యంత సన్నిహితులకు మాత్రమే ఈ విషయంపై కాస్త సమచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రుల్లోనూ.. ఆ పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ కనిపిస్తోంది.

    ఇదీ చదవండి : ఆ ప్రభుత్వ విప్ రూటే వేరు.. బూరెలతో తులాభారం.. ఎందుకో తెలుసా..?

    కేబినెట్‌ నుంచి తప్పించినంత మాత్రాన నిరాశ చెందవద్దని.. మిమ్మల్ని పదవి నుంచి తప్పించినట్టు కాదని ఆయన అంటున్నారు. అదనపు బాధ్యతలు ఇస్తున్నట్టు అని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్? మంత్రి పదవి నుంచి తప్పించిన ప్రతి ఒక్కరికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. అంతేకాదు మాజీలు కానున్న మంత్రులతో సీఎం వైఎస్‌ జగన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.. ఈ నెల ఏడున మంత్రివర్గ సమావేశం జరగనుంది.. ఆ వెంటనే అంటే ఏడు, ఎనిమిది తేదీల్లో మాజీలు కాబోతోన్న వారందరితో వన్ టు వన్‌ గా సీఎం కలవబోతున్నారు. కొందరితో లంచ్, డిన్నర్ మీటింగ్‌లు జరగబోతున్నాయి.

    ఇదీ చదవండి : ఏ జిల్లాకు ఏ అధికారి వెళ్లాలి.. సమయం దగ్గర పడ్డా రాని క్లారిటీ..

    వన్‌ టు వన్‌ జరగనున్న సమావేశా వెనుక ముఖ్య కారణం ఏంటంటే.. మాజీలు కాబోతున్న మంత్రుల మనసులోని ఏం అనుకుంటున్నారా..? పార్టీ పటిష్టత కోసం ఏం చేయాలి..? ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంది.. తమ నియోజక వర్గాల్లో పరిస్తితి ఏంటి అన్న సంగతి తెలుసుకోనున్నారు. అలాగే వారిలోని అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేయనున్నారు వైసీపీ అధినేత.. ప్రభుత్వంలో పదవులు పోయినా, పార్టీలో కీలక పోస్టులు అప్పగించే యోచనలో ఉన్న ఆయన.. కేబినెట్‌ కంటే పార్టీ పోస్టులకే తాను అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సర్ది చెప్పబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కాగా, మొదట మంత్రి పదవులు ఇచ్చినవారికి పదవులు శాశ్వతం కాదు.. మళ్లీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని ఆదిలోనే సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు