హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP BJP: బీజేపీ కొత్త నినాదం.. ఒకేసారి జగన్, బాబుపై ఫోకస్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

AP BJP: బీజేపీ కొత్త నినాదం.. ఒకేసారి జగన్, బాబుపై ఫోకస్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

అధికార వైసీపీ (YSRCP) ఎన్నికల ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ (TDP) కాస్త స్లోగానే ఉన్నా... బీజేపీ (BJP) మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది. ఒకేసారి సీఎం జగన్ (AP CM YS Jagan), ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) పై ఫోకస్ పెట్టింది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఐతే ఇప్పటి నుంచే అధికార వైసీపీ (YSRCP) ఎన్నికల ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ (TDP) కాస్త స్లోగానే ఉన్నా... బీజేపీ (BJP) మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది. ఒకేసారి సీఎం జగన్ (AP CM YS Jagan), ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) పై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం వారి సొంత ప్రాంతాన్నే వేదికగా ఎంచుకుంది. గత వారం రోజులుగా రాయలసీమ కేంద్రంగా బీజేపీ రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. కార్యకర్తలతో భేటీ, బూత్ లెవల్ కమిటీల ఏర్పాటుతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోంది. సీఎం జగన్ ఇలాకా అయిన కడపలో రాయలసీమ రణభేరి పేరుతో సభ నిర్వహించి వైసీపీ ప్రభుత్వంతో పాటు చంద్రబాబును కూడా టార్గెట్ చేసింది.

  ఏపీ చరిత్రలో రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదనే అంశాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తోంది. గత సీఎంలు సీమను నిర్లక్ష్యం చేశాయని.. తామే అభివృద్ధి చేయగలమే అంశాన్ని ఏపీ బీజేపీ లేవనెత్తుతోంది. అభివృద్ధిలోనూ నికర జలాల వాటా విషయంలో ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే అన్యాయం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. తద్వారా పాత సీఎంల విషయం ఎలా ఉన్నా.. ప్రస్తుత సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుకే ఎక్కువ డ్యామేజ్.

  ఇది చదవండి: మద్యం బ్రాండ్లపై ముదిరిన పొలిటికల్ వార్.. ఎక్కడా తగ్గని ప్రభుత్వం.. రంగంలోకి ఉన్నతాధికారులు..

  అంతేకాదు సీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యం, రైతుల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలను కూడా బయటకు తెస్తోంది. అదే సయంలో బీజేపీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయితే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ హామీలిస్తున్నారు. ఇటీవల జరిగిన రాయలసీమ రణభేరి సభలోనూ బీజేపీ నేతలు క్కువగా ఇదే అంశాన్ని లేవనెత్తారు.

  ఇది చదవండి: మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్న జగన్.. ఈసారి కూడా వర్కవుట్ అవుతుందా..?

  రాయలసీమ ఇష్యూతో పాటు కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, ఇక్కడి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును కూడా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది, దానికి కావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్తోంది. అలాగే అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నాయనని.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై, కేంద్రం ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు బీజేపీ రెడీ అంటూ సోము వీర్రాజు ఛాలెంజ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.., ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.65 వేల కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ.65 వేల కోట్లు ఇచ్చిన ఘనత కేంద్రం, ఇంకా ఎన్నో పథకాలకు నిధులిస్తున్నా వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సోము అంటున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp

  ఉత్తమ కథలు