AP POLITICS AP BJP PRSIDENT KEY COMMENTS ON YCP AND UPCMING ELECTIONS SHURU NGS
Somuveeraju: 2024 ఎన్నికలకు ఆ రెండితోనే పొత్తు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
సోము వీర్రాజు
Somuveeraju: ఏపీలో 2024 ఎన్నికలు పొత్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్నదానిపైనే ఎన్నికల ఫలితాలు ఉంటాయి అంటున్నారు. అయితే వైసీపీ సింగిల్ గా వెళ్లాలని ఫిక్స్ అయ్యింది. టీడీపీ-జనసేన కలిసి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి బీజేపీ పరిస్థితి ఏంటి..? దీనికి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.
Somuveeraju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. విపక్షాలు మాత్రం ముందస్తు తప్పవంటున్నాయి.. వైసీపీ మంత్రులు (YCP Minsters), కీలక నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అధినేత జగన్ (Jagan) మాత్రం దీనికి సమాధానం చెప్పడం లేదు. కానీ ఆయన రాజకీయ వ్యూహాలు చూసినా.. హస్తిన పర్యటనల ఫీడ్ బ్యాక్ చూసినా.. కచ్చితంగా ముందస్తుకు వెళ్లే అవకాశాలే ఎక్కువ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ముందే అన్ని పార్టీలు ఎన్నికలపై ఫోకస్ చేస్తన్నాయి. ఇందులో భాగంగా టీడీపీ (TDP) -జనసేన (Janasena) కలిసి పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీజేపీ (BJP) కూడా ఓకే అంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా చేయొచ్చు.. మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వైసీపీ (YCP) మాత్రం సింగిల్ గానే బరిలో దిగాలని ఫిక్స్ అయ్యింది. అయితే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) సైతం వచ్చే ఎన్నికల నాటికి పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయినా.. ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది.. ప్రతిపక్ష టీడీపీ ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయేదేలేదని స్పష్టం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ తో పాటు.. పొత్తులపై కూడా చర్చ సాగుతోంది.. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చకు తెరలేపారు. తాజాగా ఈ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆ రెండితోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజాగా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. ఒకటి.. బీజేపీ పొత్తు ప్రజలతో అయి ఉండాలి.. లేదా మిత్రపక్షం జనసేన పార్టీతో ఉంటుందని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు.. ఇక, జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు అని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. జనసేన వేరే పార్టీతో పొత్తు ఉంటుందనేది మీడియా సృష్టే అన్నారు. మొత్తంగా 2024 ఎన్నికల్లో బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు సోము వీర్రాజు. కాగా, ఏపీలో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండగా.. ఏ సమయంలోనైనా టీడీపీ కూడా ఆ రెండు పార్టీలతో స్నేహ్నం చేస్తుందనే చర్చ సాగుతోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.