Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP PRESIDENT SOMU VEERRAJU QUESTIONED TO GOVERNMENT WHO WILL BE ARREST CM JAGAN OR MINSTER BOTSA NGS

Somu Veerraju: సీఎం జగన్-బొత్సలలో ఎవరిని అరెస్ట్ చేస్తారు? సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

సోము వీర్రాజు

సోము వీర్రాజు

Somu Veerraju: ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్ల పై పొలిటికల్ దుమార్ రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే టీడీపీ ఇది రాజకీయ కక్ష అంటే.. ఇప్పుడు బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.. సీఎం, జగన్ బొత్సలలో ఎవర్ని అరెస్ట్ చేస్తారంటూ ఆయన నిలదీశారు.

ఇంకా చదవండి ...
    Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పబ్లిక్ ప్రశ్న పత్రాల లీకేజ్ (10th Paper leakage) విషయం.. రాజకీయంగా రచ్చ రచ్చ అవుతోంది. ముఖ్యంగా ఈ కేసులో నిందితుడిగా అనుమానింది.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ (Ex Minster Narayana)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే మరో కేసు కూడా పెట్టి.. ఆయన్ను హైదరాబాద్ (Hyderabad) నుంచి చిత్తూరు (Chitoor)కు తరలించి.. వైద్య పరీక్ష తరువాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే ఆయనకు బెయిల్ దొరికింది. కానీ ఇష్యూ మాత్రం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే టీడీపీ నేతలు.. జగన్ ప్రభుత్వం కేవలం కక్ష పూరితంగానే నారాయణ అరెస్ట్ చేసిందని ఆరోపిస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేరుగా కేంద్ర హోం మంత్ర అమిత్ షా (Amit Shah) కు లేఖ రాశారు. రాజకీయ కక్షలపై చర్యలు తీసు్కోవాలని.. నారాయణ అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీ నేత అరెస్ట్ అవ్వడంతో.. టీడీపీ నాయకులు ఆరోపణలు కామన్ గా ఉంటాయి. ఈ విషయంలో తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు చేశారు..

    నారాయణ విద్యాసంస్థల్లో పేపర్ లీక్ జరిగిందని ఆరోపిస్తూ మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. మరి సర్కారీ బడుల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయిన వ్యవహారంలో ఎవరిని అరెస్ట్ చేస్తారని సోమువీర్రాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ని అరెస్ట్ చేస్తారా? లేక విద్యాశాఖ మంత్రి బొత్సను అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీశారు. అంతేకాదు ఓ వైపు సీఎం జగన్ పేపర్ లీక్ అయ్యిందని.. నారాయణ, చైతన్య సంస్థలే ఇవి చేశాయని చెబితే.. విద్యా శాఖ మంత్రి పేపర్ లీక్ అవ్వలేదని.. మాస్ కాపియింగ్ జరగలేదు అన్నారని.. మరి ఇద్దరిలో ఎవరిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు.

    ఇదీ చదవండి : మాజీ మంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను..!

    విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావడం లేదు. ప్రభుత్వానికి దిశానిర్దేశం లేదు. నారాయణను అరెస్ట్ చేశారు. అదే విధంగా 70మంది ప్రభుత్వం స్కూల్ టీచర్లను కూడా సస్పెండ్ చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నారాయణ విద్యా సంస్థల్లో పేపర్ లీక్ అయిందని నారాయణను అరెస్ట్ చేశారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో పేపర్ లీక్ కి ఎవరు బాధ్యత వహిస్తారు? నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి నారాయణ బాధ్యత వహించారు. మరి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారా. జగనా? బొత్సనా?” అని సోమువీర్రాజు ప్రశ్నించారు.

    ఇదీ చదవండి : సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్? ఏపీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం

    మరోవైపు ఈ కేసులో నారియణను వదిలిపెట్టేదే లేదని చెప్పిన ప్రభుత్వానికి షాక్ తగిలింది. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం నారయాణను అరెస్ట్ చేశారు. అయితే రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తరువాత నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అర్ధరాత్రి 1 గంటా30 నిమిషాల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకూ సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనారాణి బెయిల్‌ మంజూరు చేశారు. ఈ సందర్భంగా లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP 10th Exams 2022, Ap cm jagan, Botsa satyanarayana, Somu veerraju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు