ఏపీలో జనసేన, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిపోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా జనసేన వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం లేదంటూ పరోక్షంగా కామెంట్ చేశారు. మా అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంతనేదిమీరో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ (PM Modi) బాగా పని చేస్తారు కానీ.. ఏపీలో మాత్రం బీజేపీ ఎదగకూడదనే అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. అయితే తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావని వివరించారు. అయితే సోము వీర్రాజు (Somu Veerraju) చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశించినవే అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఏపీలోని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ సిట్టింగ్ స్థానం కూడా టీడీపీ సొంతమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీకి ఈసారి డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో తమకు సహకరించని జనసేనపై బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.
నిన్న ఇదే అంశంపై బీజేపీ నేత మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.జనసేనతో(Janasena) కలిసి బీజేపీ(BJP) ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారని వ్యాఖ్యానించారు. తమతో పవన్ కళ్యాణ్ కలిస రావడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని పవన్ కళ్యాణ్‌ను కోరామని.. కానీ ఆయన స్పందించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించమని చెప్పారు కానీ.. బీజేపీని గెలిపించాలని కోరలేదని ఆయన అన్నారు. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్టే ఉన్నామని కామెంట్ చేశారు. జనసేనపై తమకు నమ్మకం ఉందని, తమపై జనసేనకు నమ్మకం ఉందన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయడం ద్వారా ప్రజల్లో తమపై నమ్మకం కలిగేలా చేయొచ్చని ఆయన అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు జరగకపోవడం వల్లే రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా.. క్షేత్రస్థాయిలో తమపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో ఇరు పార్టీలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ప్రజల్లో ఉమ్మడిగా పోరాటం చేయాలని అన్నారు. అయితే మాధవ్ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నారని అన్నారు. మాధవ్ ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా జనసేనపై పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
AP POLITICS: వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం..ఆ ధైర్యంతోనే వైసీపీ ప్రభుత్వంపై చింతమనేని ఫైర్
TTD Budget: 2023-24 సంవత్సరానికి టీటీడీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం.. ఎన్ని వేల కోట్లంటే..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన చిరంజీవిరావు విజయం సాధించారు. విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో సాధించగా మిగిలినవి రెండో ప్రాధాన్యత ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు అవసరం కాగా, తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి చిరంజీవిరావుకు మొత్తం 1,12,686 వచ్చాయి. వైసీపీ అభ్యర్థి సుధాకర్ టీడీపీ అభ్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇద్దరి మధ్య భారీ తేడా కనిపించింది. సిటింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్థి మాధవ్ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, Janasena