Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP PRESIDENT SOMU VEERRAJU FOCUSED ON THAT SEAT FOR NEXT ELECTIONS NGS

Somuveerraju: సోమువీర్రాజు ప్లాన్ ఏంటి? ఇప్పటినుంచే సీటుపై కర్చీఫ్ వేశారా.. ఆయన తొలి పోటీ ఎక్కడ నుంచి అంటే?

సోము వీర్రాజు (ఫైల్)

సోము వీర్రాజు (ఫైల్)

Somuveerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చే ఎన్నికల భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కచ్చితంగా నెగ్గి.. అధ్యక్షా అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. అందుకే ముందునుంచే సీటును రిజర్వ్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎక్కడైతే గెలుపు పక్కా అనుకుంటారో అలాంటి సీటులపై ఇప్పటికే ఆయన కర్చీఫ్ వేశారంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  Somuveerraju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఇటీవల దూకుడు పెంచారు.. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సమాన దూరం మెయింటెన్ చేస్తున్నారు. అయితే ఇలా ఆయన వ్యాఖ్యల్లోనూ దూకుడు పెరగడానికి ప్రధాన కారణం వేరే ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలవలేదు. గతంలో ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఈసారి మాత్రం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లెక్కలు వేస్తున్నారట. దానికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట ఏపీ బీజేపీ చీఫ్. ఆయన సొంతూరు కాతేరు. రాజమండ్రి రూరల్ (Rajhmundray) నియోజకవర్గంలో ఉంటుంది. ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ అధిష్ఠానం అసెంబ్లీకి పోటీ చేయమంటే రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో దిగాలని లెక్కలేస్తున్నారట. దానికి కూడా ఒక లాజిక్ చెప్తున్నారట వీర్రాజు. 1994లో ఇక్కడ నుంచి ఆయన పోటీచేసి ఓడిపోయారు. 2014లో మాత్రం ఇదే సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున ఆకుల సత్యనారాయణ గెలిచారు. ఆ లెక్కల ప్రకారం బీజేపీ బలంగా ఉందన్నది వీర్రాజు అండ్‌ కో చెప్పేమాట.

  ఇదే అంశంపై పార్టీలో మరో చర్చ జరుగుతోంది. వీర్రాజు మనసు పార్లమెంట్‌పై ఉందట. అలాగని రాజమండ్రి లోక్‌సభకు మాత్రం పోటీ చేయరట. ఎప్పుడో 1998లో బీజేపీ తరఫున గిరజాల వెంకటస్వామినాయుడు గెలవడం తప్ప.. తర్వాత కాపు సామాజికవర్గానికి రాజమండ్రి కలిసి రాలేదని చెబుతున్నారట. ఓడిపోయే సీటుకు మనం పోటీ చేయడం అవసరమా అని అనుచరుల దగ్గర కుండబద్దలు కొడుతున్నారట వీర్రాజు. కాకినాడ లోక్‌సభ సీటు అయితే బాగుంటుందని లీకులు ఇస్తున్నారట. ఒకటి రెండుసార్లు తప్ప కాకినాడ ఎంపీగా కాపులే గెలుస్తున్నారని.. ఆ సీటైతే ప్లస్‌ అవుతుందని లెక్కల చిట్టా విప్పుతున్నారట వీర్రాజు.     

  ప్రస్తుతం బీజేపీకి కాకినాడ లోక్‌సభకు ఎంపిక చేయడానికి సరైన అభ్యర్థి లేరని.. అనుచరులను కూడా తన శ్రుతిలో కలిపేస్తున్నారట సోము వీర్రాజు. గతంలో ఒకసారి కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా సినీ నటుడు కృష్ణంరాజు గెలిచారు. తర్వాత నరసాపురం నుంచి కృష్ణంరాజు గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. అన్నీ వర్కవుట్ అయితే కాకినాడలో గెలిచి ఆ స్థాయికి వెళ్లొచ్చనే చర్చ వీర్రాజు శిబిరంలో బలంగా ఉందట. తనలాంటి స్టేట్‌ లీడర్‌ పార్లమెంట్‌కు పోటీ చేస్తే ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా పని సులువు అవుతుందని స్థానిక నేతలు అంచనా వేసుకుంటున్నారు. అయితే తనకు పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఉన్నా.. పార్టీ ఏం చెబుతుందో చూడాలి కదా అని వీర్రాజు అంటున్నారని టాక్.

  ఇదీ చదవండి : ఆ జిల్లాలో వైసీపీ బిగ్ షాక్.. పార్టీకి రాష్ట్ర కార్యదర్శి రాజీనామా..? అందుకేనా?

  ఒకవేళ జనసేనతో పొత్తు కొనసాగితే కాకినాడ లోక్‌సభ సీటు మనదే అని అనుచరులకు క్లారిటీ ఇచ్చేస్తున్నారట. బీజేపీకి కాకినాడలో జనసైనికుల బలం తోడైతే తాను పార్లమెంట్‌కు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదని ధీమాగానే ఉన్నారట కమలం బాస్‌. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రి వచ్చినప్పుడు.. కనిపించిన రాష్ట్ర బీజేపీ నేతలతో కాకినాడ గురించి ఎక్కువ వాకబు చేశారని ప్రచారం ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Somu veerraju

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు