Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP PRESIDENT CLARITY ON FUTURE ALLIANCE WITH TDP NOW PAWAN KALYAN STAND WILL BE DECIDED NGS

TDP-YCP-BJP: ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తుల దిశగా అడుగులు.. క్లారిటీ ఇచ్చేసిన బీజేపీ

పొత్తులపై చంద్రబాబు క్లారిటీ

పొత్తులపై చంద్రబాబు క్లారిటీ

TDP-YCP-BJP: ఆంధ్రప్రదేు పైశ్ లో 2024 ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నా.. అప్పటి నుంచి ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. అయితే రాజకీయ పొత్తులపై ప్రచారం తప్ప.. బీజేపీ-జనసేన బంధం మినహా.. ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటన్నామని ప్రకటించలేదు. అయితే తాజాగా ఈ పొత్తులపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.

ఇంకా చదవండి ...
  TDP-YCP-BJP: 2024 ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని విపక్షాల టార్గెట్ అంతా ఒకటే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)ని ఓడించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని అన్ని పార్టీలు బహిరంగంగానే చెప్పాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అయితే.. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఎవరితో అయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అంటూ చెబుతూ వస్తున్నారు. ఇటు పవన్, అటు చంద్రబాబు సైతం పొత్తులకు సై అంటున్నారు. కానీ ఇక్కడే చిన్న సమస్య ఉంది. ప్రస్తుతం బీజేపీతో కలిసి పవన్ అడుగులు వేస్తున్నారు. అయితే తమ తో పాటు టీడీపీని కూడా కలుపుకొని వెళ్లడం మంచిందన్నది పవన్ ప్లాన్.. కానీ అందుకు బీజేపీ సిద్ధంగా లేదు. తాజాగా జనసేన–టీడీపీ పొత్తు పైన సోము విర్రాజు స్పష్ట మైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఇతర పార్టీల పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ ఎప్పటిలానే సింగిల్ గా యుద్ధానికి సై అంటోంది.

  సాధారణంగా ప్రస్తుతం ఏపీలో రాజకీయాల గురించి తెలిసిన వారు ఎవరైనా.. ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం.. టీడీపీ -జనసేన- బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే బీజేపీ ఏపీ చీఫ్ పొత్తుల అంశం పైన క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీతో ఇప్పటికే తమకు పొత్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే పవన్ తో తప్పా.. ఇంకెవరితోనూ కలిసి పని చేయాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.దీని ద్వారా. జనసేనతో పొత్తు చెడితే.తాము మరొకరితో కలిసే అవకాశం లేదనే అంశాన్ని స్పష్టంగా చెప్పేశారు.

  ఇదీ చదవండి : నీ ఇంటికొచ్చా.. నీ గుమ్మానికొచ్చా అంటూ వైసీపీy ఎమ్మెల్యేకు వార్నింగ్.. అదే పార్టీ మహిళా నేత ఫైర్

  టీడీపీతో జత కట్టేది లేదని ఢిల్లీ బీజేపీ నేతలు స్ఫష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యల తరువాత టీడీపీ నుంచి పొత్తుల పైన ఎటువంటి స్పందన లేదు. ఆచితూచి వ్యవహరించే ఆలోచనలో టీడీపీ ఉంది. ఇక జనసేన–బీజేపీ మధ్య పొత్తు ఉన్న తిరుపతి ఎన్నికల తరువాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఆందోళనల్లో రెండు పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా కొనసాగుతున్నారు. తాజాగా విద్యుత్ ధరల పెంపు పైన చేసిన నిరసనల్లో రెండు పార్టీలు విడివిడిగానే పాల్గొన్నాయి.రోడ్ల అంశం పైన జనసేన ఒంటరిగానే నిరసనలు వ్యక్తం చేసింది.

  ఇదీ చదవండి : : జగన్ ప్రభుత్వ పాలనపై వైసీపీ నేత సంచలన ఆరోపణ.. అవకతవకలు, అక్రమాలు పెరిగాయని ఆవేదన

  తాజాగా సోమువీర్రాజు ఇచ్చిన క్లారిటీతో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. టీడీపీ సీనియర్లు సైతం జనసేనతో పాత్తు అవసరమని భావిస్తున్నారు. ఇక జనసేన కేడర్ మాత్రం.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కంటే.. టీడీపీతోనే వెళ్తే మంచి జరుగుతుందని.. మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. మరి అధినే పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. బీజేపీ మాత్రం భవిష్యత్ లో జనసేన కొనసాగి.. టీడీపీకి ఈ రెండు పార్టీలు దూరంగా ఉంటే.. పవన్ కోరుకున్న విధంగా జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడం కష్టమే..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు