Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP LEADERS SLAMS JAGAN LED YSRCP GOVERNMENT POLICIES AND REVENGE POLITICS FULL DETAILS HERE PRN GNT

BJP vs YCP: సీఎంలున్నా సీమకు ఉపయోగం లేదు.. వారిని తరిమికొట్టాలి.. వైసీపీపై బీజేపీ రణభేరి..

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ (BJP) స్వరం పెంచింది. వైసీపీ (YSRCP) సర్కార్ అప్పులు, ఆర్ధిక అవతవకలకు పాల్పడుతోందంటూ ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీఎం జగన్ (AP CM YS Jagan) సొంత జిల్లా అయిన కడప జిల్లా (Kadapa District) లో రాయలసీమ రణభేరి పేరుతో నిర్వహించిన సభలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ (BJP) స్వరం పెంచింది. వైసీపీ (YSRCP) సర్కార్ అప్పులు, ఆర్ధిక అవతవకలకు పాల్పడుతోందంటూ ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీఎం జగన్ (AP CM YS Jagan) సొంత జిల్లా అయిన కడప జిల్లా (Kadapa District) లో రాయలసీమ రణభేరి పేరుతో నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు, రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

    రతనాల సీమ వెనుకబడిపోయిందన్న ఆయన.. ఇక్కడి నుంచి ఎంతమంది సీఎంలు వచ్చినా అభివృద్ధి మాత్రం జరగలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని.. పోలవరాన్ని పూర్తిగా కేంద్రం నిధులతోనే చెపట్టామన్నారు. ఏపీలో కుటుంబ పార్టీలు పోవాలని.. ప్రజాస్వామ్యంలో ఎంతటివారికైనా పతనం తప్పదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

    ఇది చదవండి: బూమ్ బూమ్ బాబు, టీడీపీ ప్రెసిడెంట్ మెడల్.., ఏపీలో మద్యం బ్రాండ్లపై వైసీపీ కౌంటర్ ఎటాక్..


    రాయలసీమ రణ భేరి సాక్షిగా పెండింగ్ ప్రాజెక్టుల సాధనే తమ లక్ష్యమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాయలసీమ కు అన్యాయం చేసినందుకు గత కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. రాయలసీమ లో అనేక వనరులు ఉన్నాయన్న ఆయన.. రాయలసీమలో సోమ శిల ప్రాజెక్టు కోసం బద్వేలు ప్రజలు పోరాడుతున్నారు. పొలవరాన్ని కేంద్రం పూర్తి చేస్తుందని.. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో మైనర్ ఇరిగేషన్ కు మంత్రి లేడని.. ఇందుకే రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు.

    ఇది చదవండి: ఏపీలో మద్యపాన నిషేధం సాధ్యమేనా..? ఆ విషయంలో జగన్ సర్కార్ ఫెయిల్ అయిందా..?


    వైసీపీ కక్ష్య పూరిత పరిపాలన చేస్తోందని.. పులివెందులలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆమె భూములు కబ్జా చేశారని ఆరోపించారు. జగన్ వ్యక్తిగత కక్షలు మానుకోవాలని హెచ్చరించారు. ఇసుక మట్టి అమ్ముకునే దొంగలకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్న సోము.. చైనా,పాకిస్థాన్ లాంటి వారికే బీజేపీ భయపడలేదన్నారు.

    ఇది చదవండి: మా ఏరియాలో ట్రాఫిక్ క్లియర్ చేయండి.. పోలీసులకు బుడతడి కంప్లైంట్..


    వైసీపీ హయాంలో రాయలసీమకు వచ్చిన ప్రాజెక్టులేంటో చెప్పాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ చేయాల్సింది చేయరని.. చేయకూడనివి మాత్రమే చేస్తారని విమర్శించారు. మాజీ మంత్రి వివేకాను వాళ్లే హత్య చేసి కేసులు మాత్రం తనపై పెట్టారన్నారు. ఈ కేసులో బయటకి వస్తున్నవన్నీ వైసీపీ నేతల పేర్లేనని గుర్తు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, Ysrcp

    తదుపరి వార్తలు