Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP LEADERS SLAMS AP POLICE BECAUSE OF SECURITY TO PM MODI TOUR CONGRESS LEADERS PROTEST WITH BLACK BALLOONS NGS GNT

Modi tour: ప్రధాని టూర్ లో భద్రతా వైఫల్యంపై బీజేపీ ఆగ్రహం.. నల్లబెలూన్లు ఎగురవేసింది వారే అంటూ పోలీసుల వివరణ

ప్రధాని టూర్ లో భద్రతా వైఫల్యం

ప్రధాని టూర్ లో భద్రతా వైఫల్యం

Modi tour: ప్రధాని నరేంద్ర మోదీ భద్రతపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు సెక్యూరిటీ కల్పించడంలో ఘోరంగా ఫెయిలయ్యారని.. ప్రధాని పర్యటిస్తోంటే కొన్ని దుష్ట శక్తులు ప్రమాదకర బెలూన్లు ఎగరవేసి.. భారీ కుట్రకు ప్లాన్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే నలబెలూన్లు ఎవరు ఎగురవేశారు.. ఎందుకు ఆ పని చేశారో గుర్తించామంటున్నారు పోలీసులు.. ఇంతకీ ఏం జరిగింది అంటే...

ఇంకా చదవండి ...
    Modi tour: ప్రధాని మోదీ భీమవరం టూర్ (Prime Minster Modi Bheemavaram tour) లో భద్రతా వైఫల్యంపై  (Security Issues) ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు పెద అమిరంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ (Prime Minster Modi)  ఆంధ్రప్రదేశ్ (Adnrha Pradesh) కు వచ్చారు. భీమవరంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.  తరువాత హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్లకు బయలు దేరారు. ఈనేపథ్యంలో కొందరు నిరసన తెలుపుతూ.. డజన్ల కొద్దీ నల్ల ఎయిర్‌ బెలూన్‌లను (Air Balloons) గాల్లోకి వదిలారు. గన్నవరం ఎయిర్ పోర్టు (Gannavaram Airport) సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి బెలూన్లు కాంగ్రెస్ నేతలు వదిలారు. అవి ఎగురుతూ.. అందరికీ కనిపించాయి. పొరపాటున అవి హెలికాప్టర దగ్గరకు వెళ్తే ఏంటి పరిస్థితి అని బీజేపీ నేతలు భయపడ్డారు. ఆ వదిలిన నల్ల బెలూన్లు హెలికాఫ్టర్ ను తాకకపోయినా చుట్టూ మాత్రం ఎగిరినట్లు కనిపించాయి.

    ఎయిర్‌బెలూన్‌లు వదలడంపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు  (BJP AP Chief Somuveerraju) మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయం సమీప ప్రాంతం ప్రధాని పర్యటిస్తోంటే కొన్ని దుష్ట శక్తులు ప్రమాదకర బెలూన్లు ఎగరవేశారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నల్ల బెలూన్లు ఎగరవేయడం ద్వారా భారీ కుట్రకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటన వెనుక సూత్రధారులు పాత్రధారులు కుట్ర అమలు చేసిన దుష్టశ్తులను వెంటనే గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

    వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నల్ల బెలూన్లు ఎగరేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నించారు. ప్రధాని పర్యటనలో చోటు చేసుకున్న ఈ భద్రతా వైఫల్యాన్ని ఎస్పీజీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై కలకలం రేగుతోంది. భద్రతా వైఫల్యం అంటూ వస్తున్న విమర్శలను ఏపీ పోలీసలు సీరియస్ తీసుకున్నారు వెంటనే విచారణ చేపట్టి.. బెలూన్లు ఎగురవేసిన వారిని గుర్తించారు. ఆ నల్లబెలూన్లలో హైడ్రోజన్ లేదన్నారు. కేవలం నోటితో ఊదిన బెలూన్లే అవని.. అందుకే ఎక్కువ దూరం ఎగురలేకపోయాయి అన్నారు. కాంగ్రెస్ నేతల పిలుపు మేరకు నల్లబెలూన్లు ఎగురవేశారని.. అవి నాలుగు కిలోమీరట్ల దూరంలో ఎగిరాయి అన్నారు.

    ఇదీ చదవండి : ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు ఫస్ట్ ప్లేస్.. ఎన్నికలకు రెండేళ్ల ముందే 7 గురు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీవీ.. వారు ఎవరంటే..?

    ప్రధాని పర్యటనలో ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూ లేదన్నారు. అలాగే తమను ఎష్సీజీ వివరణ అడగలేదని జిల్లా ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో బెలూన్లు యువకులు వదిలినట్లు గుర్తించామన్నారు. అలాగే ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ నిరసన తెలుపేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు రాజమండ్రిలో పీసీసీ చీఫ్ శైలజానాధ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Gannavaram, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు