Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP CHIEF SOMU VEERRJAU SLAMS AP GOVERNMENT ON ELECTRICITY CHARGES AND HINDU TEMPLES ISSUE FULL DETAILS HERE PRN

AP BJP: అలా అనడానికి నోరెలా వచ్చింది.. ఏపీ ప్రభుత్వంపై సోము ఫైర్.. మరోసారి తెరపైకి ఆలయాల అంశం..

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ ఛార్జీల పెంపు (Electricity Charges Hike) కు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) లు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ ఛార్జీల పెంపు (Electricity Charges Hike) కు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) లు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ‘విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు సామాన్యుడిపై భారం పడుతుందన్న ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజల అవసరాలను ప్రభుత్వం ఆదాయ మార్గాలుగా మలుచుకోవడం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

    ప్రభుత్వ అధికారులు విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంచాం అనడం మంచిది కాదన్న ఆయన., తప్పులు జరుగుతుంటే అప్పులుపెరిగిపోతుంటే దాని పైన ప్రభుత్వం లో శ్రద్ధ కనబడడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము అంగీకరించే ప్రసక్తే లేదన్న సోము వీర్రాజు.., ప్రభుత్వం ఉపసంహరించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పషఅటం చేశారు.

    ఇది చదవండి: కాబోయే ప్రధాని వైఎస్ జగన్.. ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..


    ఇక ఏపీలో హిందూ ఆలయాలకు రక్షణ లేదని సోము వీర్రాజు అన్నారు. దేవాలయాల ప్రాంగణాల్లో అన్యమతస్తులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇదేమిటని అడిగితే కేసులు పెడుతున్నారని.., ఇలాంటి వారిపై బీజేపీ దూకుడు ప్రదర్శించాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రా పురంలోని రామాలయంలో క్రైస్తవ కూటాలు నడుస్తున్నాయని స్థానికులు అడ్డుకుంటే కేసులు పెడతామంటున్నారు అంటే ఈ ప్రభుత్వానికి హిందువులను అణచి వేయాలన్న దుర్మార్గంతో ఉందా అని ప్రశ్నించారు.

    ఇది చదవండి: రామాలయంలో క్రిస్టియన్ ప్రార్ధనలు.. సోషల్ మీడియాలో వైరల్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు..


    అలాగే శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన కర్నాటక భక్తుడిపై షాపుయజమాని అన్యమతస్థుడు గొడ్డలితో దాడిచేశాడంటే మంచినీళ్ళు అమ్మే షాపులో మారణాయుధాలు ఎలా ఉన్నాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. అన్యమతస్తులు హిందూభక్తులపై శ్రీశైలం దేవాస్ధానంలో యధేచ్చగా దాడులుకు దిగితే పోలీసులు, దేవాస్ధానం ఉద్యోగులు హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అరోపించారు. శ్రీశైలంలో రజాక్, రఫీల రాజ్యం నడుస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవాలయంలో ఆగమశాస్త్రం ప్రకారం నడుచుకోవలసిన అధికారులు దేవాస్ధానం విధానాలకు విరుద్దంగా స్థానిక ఎమ్మెల్యే అనుచురులకు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శ్రీ శైలంలో జరిగిన ఘటనలపై ఒక కమిటినీ, రామచంద్రాపురం సంఘటనలపై మరో కమిటీని పార్టీ ప్రతినిధులతొ నియమిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. అనంతరం శ్రీశైలం దేవాస్ధానానికి తాను స్వయంగా వెళతానని ప్రకటించారు. హిందువ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైసిపి ప్రభుత్వానికి గట్టి బుద్దిచెబుతామని సోమువీర్రాజు తీవ్రస్వరంతో హెచ్చరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, Somu veerraju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు