Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP CHIEF SOMU VEERRAJU SLAMS YS JAGAN AND GOVERNMENT ON THREE CAPITALS ISSUE FULL DETAILS HERE PRN

AP BJP: మాట తప్పారు.. మడమ తిప్పారు.. సీఎం జగన్ ప్రకటనపై బీజేపీ రియాక్షన్ ఇదే.. అంత సీన్ లేదన్న సుజనా..

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

మూడు రాజధానుల (Three Capitals Issue)పై వెనక్కి తగ్గమని అసెంబ్లీ (AP Assembly) లో సీఎం జగన్ (CM YS Jagan) ప్రకటించడంపై మరోసారి రాజధాని అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ తీరును తప్పుబట్టగా.. బీజేపీ కూడా ఈ జాబితాలో చేరింది

ఇంకా చదవండి ...
    మూడు రాజధానుల (Three Capitals Issue)పై వెనక్కి తగ్గేదేలేదని అసెంబ్లీ (AP Assembly) లో సీఎం జగన్ (CM YS Jagan) ప్రకటించడంపై మరోసారి రాజధాని అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ తీరును తప్పుబట్టగా.. బీజేపీ కూడా ఈ జాబితాలో చేరింది. సీఎం ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన మాటలపై అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఆయన విమర్శించారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని సోము స్పష్టం చేశారు. పార్లమెంట్, న్యాయ స్థానాలవంటి పదాలు అసెంబ్లీలో వినియోగించి వికేంద్రీకరణ పాఠ పాడడం దారుణంమన్నారు.

    కర్నూలు హైకోర్టు బీజేపీ కోరుకుంది అంటే అది రాజధాని కాదని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారని.., అమరావతి రాజధాని కేంద్రం గా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తుచేశారు. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధిపై తాము శ్వేపత్రం విడుదల చేయగలమని.., మీరు బ్లాక్ పేపర్ విడుదల చేయగలరు అంటూ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: దమ్ముంటే ఆ పనిచేయండి.. రాజధానిపై జగన్ కు చంద్రబాబు సవాల్..


    రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ, న్యాయస్థానం చట్టసభ అధికారాల్లో జోక్యం చేసుకోలేదంటూ, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారంటూ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. సంఖ్యాబలం వుందని దబాయిస్తే వక్రీకరణలు వాస్తవాలు కావన్న సుజనా.. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తామంటే కుదరదన్నారు. పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం, దీనికి ఆనాడు విపక్షంలో వున్న వైసిపి మద్దతివ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని మార్చాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంటు ఆమోదానికి పంపాలి చెప్పారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధానిని మార్చడం న్యాయపరంగా చెల్లదని సుజనా పేర్కొన్నారు.

    ఇది చదవండి: మూడు రాజధానులపై తగ్గేదేలే..! అది మా హక్కు, బాధ్యత..! స్పష్టం చేసిన సీఎం


    సీఆర్డీఎకి, భూములిచ్చిన రైతులకు మధ్య చట్టబద్ధమైన ఒప్పందం జరిగిందని.., ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, సిఆర్డీఎని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలను హైకోర్టు స్పష్టంగా చెప్పిందని.,. అంతే గానీ శాసనసభకు, ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పలేదని తెలిపారు. కోర్టుల మీద దుష్ప్రచారం చేస్తూ, కోర్టుల విశ్వసనీయతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ రోజు శాసనసభను వేదికగా చేసుకుని జగన్, ఎమ్మెల్యేలు అసత్య ప్రచారం చేశారని సుజనా మండిపడ్డారు.

    ఇది చదవండి: మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఇదే.. అసెంబ్లీలో లెక్కలు చెప్పిన మంత్రి..


    వ్యవస్థల విధ్వంసం కోసం ఎంతకైనా తెగిస్తారని సభ సాక్షిగా మరోసారి నిరూపించారని., వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలకు తెర తీస్తున్నారిని సుజనా చౌదరి ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం మళ్లీ తెస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదన న్యాయసమీక్షకు నిలవదని., ఏపీ కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదని., అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆయన అభిప్రాయపడ్డారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Somu veerraju, Sujana Chowdary

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు