హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP BJP: ఏపీలో ఇదే అతిపెద్ద స్కామ్.. సోము వీర్రాజు సంచలన ఆరోపణలు..

AP BJP: ఏపీలో ఇదే అతిపెద్ద స్కామ్.. సోము వీర్రాజు సంచలన ఆరోపణలు..

సోము వీర్రాజు

సోము వీర్రాజు

దేశంలో ఎక్కడా జరగని అవినీతి, కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే జరుగుతున్నాయని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. ముఖ్యంగా రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతందని ఆయన మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా జరగని అవినీతి, కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే జరుగుతున్నాయని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. ముఖ్యంగా రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతందని ఆయన మండిపడ్డారు. పేదల బియ్యాన్ని కొనుగోలు చేసే బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని డిమాం చేశారు. ప్రజలకు రేషన్ బదులు డబ్బులిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపానలను సోము కండించారు. కిలో బియ్యానికి 38 రూపాయలు ఖర్చు చేసి పేదలకు అందిస్తుంటే.. ప్రభుత్వం 15 రూపాయలకు కొనుగోలు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. రైస్ మిల్లర్స్ మాఫియాగా ఏర్పడి దోచుకుంటుంటే ఏ పార్టీ పోరాటం చేయడం లేదని.. తాము మాత్రం వారిపై పోరాడతామని సోము స్పష్టం చేశారు. రైస్ మిల్లులన్నీ రీమిల్లింగ్ చేస్తున్నాయని ఇది అతిపెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. రవాణా, పౌరసరఫరా శాఖల్లో వందలకోట్ల అవినీతి జరుగుతోందని సోము వీర్రాజు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.., తిరుమల విషయంలో అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే బావుంటుందని సూచించారు. టీటీడీ బడ్జెట్ రూ.3500 కోట్లలో ధర్మ ప్రచారానికి ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. సినిమా వాళ్ళను ఎస్వీబీసీలో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.

ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఆలయం వద్ద ఊహించని పరిణామం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ


శుక్రవారం శ్రీవారి ఆలయం వద్దఉన్న ఎల్ఈడీ స్క్రీన్లలో సినిమా పాటలు ప్లే చేయడంపై సోము వీర్రాజు మండిపడ్డారు. ఎస్వీబీసీలో సినిమా పాటలు వేస్తున్నారని ఆరోపించారు. ధర్మం గురించి తెలియని వారు సంస్థలో ఉన్నారని విమర్శించారు. అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ నుంచి ఐదు వేల కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తే తామే అడ్డుకున్నామన్నారాయన.


ఇది చదవండి: సీఎం, మంత్రులను శిక్షించాల్సిందే.. ఏపీ సర్కార్ ను వదలని రైతులు.. కోర్టులో పిటిషన్..!


ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఒక మాటపైకి వచ్చి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. 2017లో వచ్చిన జీవో ఆధారంగా B కేటగిరీ కోటాలో 15 సీట్లు మేనేజ్ మెంట్ కోటాగా మారుస్తున్నారని.., దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల విషయంలో బీజేవైఎం పోరాటం చేస్తోందని.. ఉద్యోగాలివ్వని ఏపీపీఎస్సీ ఎందుకని మూసేయాలంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ఎర్ర చందనం అక్రమాలు జరుగుతున్నాయని.. సిలికాన్ సాండ్ అక్రమంగా తమిళనాడుకు తరలిపోతోందన్నారు. రాష్ట్రంలో సిలికాన్ సాండ్, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేస్తే ఖజానా నిండుతుందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Somu veerraju

ఉత్తమ కథలు