Home /News /andhra-pradesh /

AP POLITICS AP BJP CHIEF SOMU VEERRAJU PARTICIPATED IN SAWATCH BHARATH AT VIJAYAWADA SALMS AP GOVERNMENT FULL DETAILS HERE PRN GNT

AP Politics: రాష్ట్రంలో డొల్ల ప్రభుత్వం.. జగన్ సర్కార్ పై సోము ఫైర్.. కృష్ణానది ఒడ్డున స్వచ్ఛభారత్..

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డొల్ల ప్రభుత్వం నడుస్తోందని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) అధ్వర్యంలో విజయవాడ (Vijayawada) కృష్ణానది ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డొల్ల ప్రభుత్వం నడుస్తోందని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) అధ్వర్యంలో విజయవాడ (Vijayawada) కృష్ణానది ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నదీతీరంలో సుమారు గంటకుపైగా నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో సోము వీర్రాజు సహా బీజేపీ నేతలంతా చీపుళ్లు చేతబట్టి చెత్తతొలగించారు. సోము వీర్రాజు స్వయంగా చెత్త ఊడ్చి డబ్స్ బిన్లలోకి ఎత్తారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్వచ్ఛభారత్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంటే ఏపీలో మాత్రం సవ్యంగా ఖర్చు చేయడం లేదని ఆయన ఆరోపించారు. నగర పంచాయితీల నుండి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు అందంగా తీర్చిదిద్ది సౌకర్యవంతంగా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఆంధ్ర రాష్ట్రంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.

    ప్రతి ఏడాది స్వచ్ఛ్ భారత్ పేరిట ఏపీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తుంటే.. ప్రభుత్వం మాత్రం సరిగా వినియోగించడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ఇక పన్నుల విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్న ఆయన.., పేదలకు ఇళ్ళ నిర్మాణం విషయంలో వైసిపి ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందిని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.32 వేల కోట్లు నిధులు మంజూరు చేస్త.. జగన్ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా పన్నులు వసేస్తోందని మండిపడ్డారాయన. ఇది కచ్చితంగా దోపిడీనేని ఆరోపించారు.

    ఇది చదవండి: ఏపీలో వీరికి విద్యుత్ కోతల నుంచి మినహాయింపు.., గీతదాటితే వాతే..!


    విద్యుత్, డ్రెయినేజీ వంటీ మౌలిక వసతులు కల్పించకుండా అంటే విద్యుత్, డ్రైయినేజ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా పన్నులు ఎలా వసూలు చేస్తారని సోము ప్రశ్నించారు. ఈ డొల్ల ప్రభుత్వాన్ని బిజెపి లెక్క చేయదని.., ఈ విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ వైసీపీ ప్రభుత్వం అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులు ఏంచేశారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని చాలా పథకాలు కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సొంత పథకాలుగా ప్రచారం చేయిస్తోందని సోము ఆరోపించారు.

    ఇది చదవండి: Bandla vs SaiReddy: పీక్స్ లో ట్వీట్ వార్.. మధ్యలో ఎన్టీఆర్, రామ్ చరణ్.. సీబీఐ ఎంక్వైరీకి ఛాలెంజ్..


    ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, బిజెపి విజయవాడ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం, ఒబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసం ఉమామహేశ్వర రాజూతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Somu veerraju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు