Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Somu Veerraju on Pawan: ప్రధాని మోదీ సభకు పవన్ ఎందుకు రాలేదంటే..? క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు.. ఏమన్నారంటే..?

Somu Veerraju on Pawan: ప్రధాని మోదీ సభకు పవన్ ఎందుకు రాలేదంటే..? క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు.. ఏమన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్)

Somu Veerraju on Pawan: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. జనసేన అధినేత పవన్ ఎందుకు సభకు రాలేదంటూ రాజకీయంగా చర్చ జరుగూతూనే ఉంది. జనసేన-బీజేపీకి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఆ ప్రచారంపై ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

Somu Veerraju on Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని భీమవరంలో సోమవారం ప్రధాని మోదీ (Prime Minster Modi) చేతుల మీదుగా జరిగిన అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. అయితే ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) రాకపోవటంపై రాజకీయంగా కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. బీజేపీకి జనసేన దూరమవుతోందని.. రెండు పార్టీల మధ్య ఇప్పటికే కొంత గ్యాప్ ఉందని.. భవిష్యత్తులో బీజేపీతో కలిసి వెళ్లడం ఇష్టం లేకనే.. పవన్ డుమ్మా కొట్టారనే ప్రచారం ఉంది. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఇవాళ స్పందించారు. అసలు ఈ కార్యక్రమానికి, రాజకీయాలకి సంబంధంలేదని చెప్పారు. జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని మరోసారి చెప్పారు. ఏపీలో ప్రధాని పర్యటన బాగా జరిగిందని సోము వీర్రాజు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీలకు కుటుంబ పాలనపైనే మక్కువని, బీజేపీకి మాత్రం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.

అలాగే ఏపీలో యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు యువ సంఘర్షణ యాత్ర నిర్వహిస్తామన్నారు. యువతకు ఉద్యోగాలిస్తామని జగన్ హామీ ఇచ్చారని.. కానీ అందర్నీ మోసం చేశారని ఆరోపించారు. టీచర్లు, పోలీసు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తాం‌నన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కూడా చెప్పారు. అన్ని వర్గాల వారికీ తానున్నానని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ తీరుకారణంగా అన్ని వర్గాలు నష్టపోయాయి అన్నారు. అందరూ నష్టపోయారు. ఏపీలో రెండో‌ విడత రేషన్ బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. దీనిపై బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. పేదల పక్షాన బీజేపీ నిత్యం పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. అలాగే ప్రధాని పర్యటనలో‌ నల్ల బెలూన్లు ఎగరేయడం సరికాదని. మోదీ ఆదివాసీల గురించి మాత్రమే మాట్లాడారు. ప్రతిదీ రాజకీయ కోణంలో‌ చూడటం మంచిపద్ధతి కాదన్నారు. కొందరు సడన్‌గా పుట్టుకొచ్చి మేధావుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని బీజేపీ పట్టించుకోదు అన్నారు. ఎందుకంటే సబ్ కా సాత్, సబ్ కా‌ వికాస్ అనేది మోడీ మంత్రం.

ఇదీ చదవండి : ఏపీలో వారందరికీ శుభవార్త.. ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా డబ్బులు.. అర్హత ఏంటంటే..?ల

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలోని జాతీయ రహదారులు బాగున్నా రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను బాగుచేసే బాధ్యతని యువకులకు ఇస్తాం. మొక్కలు పెంచి,‌ సంరక్షించే పనినీ నిరుద్యోగులకే అప్పజెబుతామన్నారు. తరువాత ఆయన యువ సంఘర్షణ యాత్ర పోస్టర్‌ను, లోగోను ఆవిష్కరించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Pawan kalyan, Somu veerraju

ఉత్తమ కథలు