ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం జనసేన-బీజేపీ పొత్తు (Janasena-BJP Alliance) వ్యవహారం. బీజేపీ వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కామెంట్స్.. ఆ తర్వాత చంద్రబాబు (Chandrababu) తో భేటీ అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veeraju) స్పందించారు. జనసేనతో పొత్తు కొనసాగే అంశంపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ తో ప్రజాస్వామ్యం పరిరక్షణ మాత్రమే కలిశారన్న సోము వీర్రాజు.. వాళ్లిద్దరి మధ్య పొత్తుల అంశం చర్చకురాలేదన్నారు. ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. అంతకుముదు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద మాట్లాడిన సోము వీర్రాజు అదే అంశాన్ని ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ యాత్రను ప్రభుత్వమే కావాలని నిలిపేసిందని.. ఇలాంటి ఘటనలు సరికాదన్నారు.
పవన్ కు సంఘీభావం తెలపడానికి అన్ని పార్టీల నేతలు కలిశారని.. చంద్రబాబు వెళ్లి పవన్ ను కలవడాన్ని స్వాగతిస్తున్నానని వీర్రాజు తెలిపారు. పవన్ కు ఇవ్వాల్సిన రోడ్ మ్యాప్ పై బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని.. తామిద్దరం కలిసే ముందుకెళ్తామన్నారు. ఏపీలో జరిగిన పరిణామాలన్నింటినీ పార్టీ పెద్దలకు వివరించినట్లు ఆయన తెలిపారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంపైనా సోము కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నా పార్టీలో చాలా పెద్ద వ్యక్తని.. ఆయన కామెంట్స్ కు తాను స్పందించనని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పరిధిలో మేరకే మాట్లాడతానని స్పష్టం చేశారు.
గురువారం ఒంగోలులో పర్యటించిన ఆయన.. చాలా రోజుల తర్వాత దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగినా పోలీసులు లైట్ తీసుకుంటున్నారన్నారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఇక్కడ ఎస్సీ స్పందన సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు.
తాము దేవాలయాల దాడులపై పోరాడితే పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ విగ్రహం చేయి విరిగితే .. రాద్దాంతం చేస్తున్న వైసీపీ.. దేవాలయాల విషయంలో మాత్రం స్పందించడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు.
ఇక ఏపీలో పాదయాత్ర చేసే హక్కు రాహుల్ గాంధీకి లేదని.. రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం చేసిన వ్యక్తి ఆయనేనన్నారు. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ రాజకీయం చేస్తోందని.., అమరావతి రాజధానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. వివాదాలతో రాష్ట్రం అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందన్న సోము వీర్రాజు.., డిసెంట్రలైజేషన్ పేరుతో జగన్ చెప్పేదంతా బూటకమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Bjp-janasena, Local News, Somu veerraju