Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే దుమారం రేగింది. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. అమరావతి (Amaravati) లో ఇన్ సైడ్ ట్రేడింగ్ (Inside Tragding) జరిగిందని మంత్రి బుగ్గన ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ నేతలకు ముందే తెలిసి.. భూములు కొన్నారని.. దానికి సంబంధించి ఆధారాలు తమ దగ్గరే ఉన్నాయి అన్నారు. దీనిపై పయ్యావుల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్రకటన తరువాతే భూములు కొన్నామన్నారు. నిజంగా దమ్ముంటే.. బినామీ భూముల చట్టం పేరుతో ఆ భూములు వెనక్కు తీసుకోండి అంటూ సవాల్ విసిరారు. అయితే తెలుగు దేశం పార్టీ నేతలు అందరికీ ముందే వ్యవహారం తెలుసని.. అక్కడ పేదల దగ్గర భూములు కొన్న తరువాతే రాజధాని ప్రకటించారని.. తన దగ్గర రుజువులు ఉన్నాయి అన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేనితో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంత చెప్పినా టీడీపీ నేతలు వెనక్కు తగ్గలేదు. దీంతో ఒకరోజు పాటు వారిని సభ నుండి సస్పెండ్ చేశారు.
అంతకుముందు బుగ్గన ఏమన్నారంటే.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పూర్తిగా పక్కపెట్టేశారని ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. అక్కడ టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని అన్నారు. పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, కంభంపాటి సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు సేకరించారని.. వాటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అన్నారు.
ఇదీ చదవండి : శ్మశానాన్ని కేరాఫ్ గా మార్చుకున్న దొంగ.. ఫోన్ సహా ఎలక్ట్రానిక్ వస్తువులే వాడడు
హెరిటేజ్ ఫుడ్స్ కూడా 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అప్పటి ప్రభుత్వం తిరస్కరించిందని వ్యాఖ్యానించారు. అమరావతిలోవి తాత్కాలిక నిర్మాణాలు.. వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే ఉన్నాయన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని బుగ్గన ఆరోపించారు.
ఇదీ చదవండి : వాట్ యాన్ ఐడియా..! బుల్లెట్ బార్బిక్యూ.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే..?
మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని.. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గురువారం వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం జగన్పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఉద్దేశం లేదు.
ఇదీ చదవండి: నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్
చంద్రబాబు బినామీలు దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను లాక్కున్నారు. టాలీవుడ్ పెద్దలు అశ్వనీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట అమరావతిలో భూములిచ్చారని.. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కట్టబెట్టారని ఆరోపిస్తూ టాలీవుడ్ పెద్దల పేర్లను నాని తెరపైకి తెచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh assembly session, AP Assembly, Ap cm jagan, AP News, Buggana Rajendranath reddy