హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్‌కు ఓటు వేయడం బైబిల్‌కు విరుద్ధం..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌కు ఓటు వేయడం బైబిల్‌కు విరుద్ధం..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

కే ఏ పాల్ (File)

కే ఏ పాల్ (File)

జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణ కాష్టమవుతుందని..చంద్రబాబు సీఎం అయితే ఏపీ అభివృద్ధి చెందదని ధ్వజమెత్తారు. విజసాయిరెడ్డి చెప్పినట్లే ఎన్నికల సంఘం నడుచుకుంటోందన్న కేఏ పాల్.. ఎన్నికల వాయిదా వేయాలని తాము ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇంకా చదవండి ...

  క్రైస్తవుడిగా ఉండి తిరుమలకు ఎలా వెళ్తారని వైఎస్ జగన్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. జగన్‌కు ఓటు వేయడం బైబిల్‌కు విరుద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంపై గౌరవం ఉన్న ప్రజలు జగన్‌కు ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు పాల్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమపై జగన్‌కు సంబంధించిన వ్యక్తులు దాడులకు ప్రయత్నించారని ఆరోపించారు.

  మాపై దాడులు చేసి బీఫారాలు ఎత్తుకెళ్లారు. మా అభ్యర్థుల పేర్లతో ఇతర పార్టీల అభ్యర్థులను పోటీకి పెట్టారు. బీఫారలాలు పోయాయని ఫిర్యాదుచేసినా ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదు. మాపై దాడులు చేస్తున్నది జగన్ గ్యాంగ్‌కు చెందినవారే. రాష్ట్రం మీద గౌరవం ఉన్నవాళ్లు జగన్‌కు ఓటువేయరు. వివేకా హత్య కేసుపై కోర్టు ఉత్తర్వు ఉన్నందున ఏమి మాట్లాడను. జగన్ క్రైస్తవుడిగా ఉండి, తిరుమలకు వెళ్లడం బైబిల్‌కు విరుద్ధం. నేను చిన్నతనంలో శ్రీనివాస్ పేరుతో ఉన్నప్పుడు వెళ్ళాను. బైబిల్‌కి విరుద్ధ చర్యలకు పాల్పడ్డ జగన్‌కు ఓట్ వేయడం బైబిల్‌కు విరుద్ధం.
  కేఏ పాల్

  చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్ చట్టవిరుద్ధంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. సీఎం కావడానికి జగన్‌కు ఏం అర్హత ఉందని మండిపడ్డారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణ కాష్టమవుతుందని..చంద్రబాబు సీఎం అయితే ఏపీ అభివృద్ధి చెందదని ధ్వజమెత్తారు. విజసాయిరెడ్డి చెప్పినట్లే ఎన్నికల సంఘం నడుచుకుంటోందన్న కేఏ పాల్.. ఎన్నికల వాయిదా వేయాలని తాము ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. అన్ని ఆధారాలు ఉన్నా ఎన్నికలను వాయిదా వేయడం లేదని విరుచుకుపడ్డారు కేఏ పాల్.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra, Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, AP Politics, Ka paul, Narsapuram S01p09, Praja shanti party

  ఉత్తమ కథలు