Home /News /andhra-pradesh /

AP POLITICS AP 10TH PAPER LEAKAGE UPDATE CHITOOR POLICE FILE A CASE AGAINST EX MINSTER NARAYANA BAIL NGS

AP 10th Paper Leak: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు..! కోర్టులో చిత్తూరు పోలీసుల పిటిషన్

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

AP 10th Paper Leak: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు అవుతుందా..? పదో తరగతి పేపర్ లీకేజ్ పై పోలీసుల దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా..? ముఖ్యంగా ఈ కేసుతో్ నారాయణకు సంబంధం ఉందని గట్టి వాధించడం వెనుక రీజన్ ఏంటి.. కచ్చితంగా నారాయణను అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారా..? ఏం జరగనుంది..?

ఇంకా చదవండి ...
    AP 10th Paper Leak: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పేపర్ల లీక్ (10th Exams Paper leakage) వ్యవహారంపై దుమారం ఆగడం లేదు.. ఇప్పుడ మొత్తం వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ (Ex Minster Narayana) అరెస్ట్ తో.. రాజకయంగా రచ్చ అవుతోంది. ఇటు ప్రభుత్వం.. అటు పోలీసులు సైతం.. అంతా నారాయణ కను సన్నల్లోనే జరగింది అని ఆరోపిస్తున్నాయి. దానికి సబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.. కేవలం మార్కులు.. ర్యాంకుల కోసం ఎప్పటి నుంచో ఈ దందా నడుస్తోందని.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న వారిని.. సీఎం జగన్  (CM Jagan) ఎట్టి పరిస్థితుల్లో వదలరంటూ మంత్రులు చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో పోలీసులు సైతం పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీరియస్ గానే ఉన్నారు. చాలాచోట్ల పేపర్ లీకేజ్ అయినా.. అందులో ప్రధాన పాత్ర నారాయణ సంస్థలదే అన్నది పోలీసుల వెర్షన్.. ముఖ్యంగా చిత్తూరులో లీకేజ్ అయిన పేపర్ తిరుపతి (Tirupati) ఎస్వీ బ్రాంచ్ నుంచి.. బయటకు వచ్చిందని.. అది కూడా స్వయంగా ఆ సంస్థ వైస్ ప్రిన్సిల్ వాట్సప్ నుంచే వచ్చిందని పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఆయన్ను విచారించినప్పుడే నారాయణ పాత్ర బయట పడింది అంటున్నారు..

    అనుకున్నట్టే నారాయణను అయితే హైదరాబాద్ వెళ్లి మరి పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపిందది. అయితే నారాయణ అరెస్టు వ్యవహారంలో గంటల వ్యవధిలోనే అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. పదో తరగతి పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ కేసుతోపాటు అమరావతి భూకుంభకోణం కేసులపై అరెస్టయిన పి. నారాయణకు వెంటనే భారీ ఊరట లభించింది. జగన్ సర్కారుకు భారీ షాకిస్తూ, పోలీసులు చేసిన అభియోగాలను న్యాయమూర్తి తిరస్కరించారు. ఎందుకంటే నారాయణ తనకు అసలు ఆ సంస్థలతో ప్రస్తుతం సంబంధం లేదని.. గతంలోనూ రాజీనామా చేశానంటూ ఆధారాలు సమర్పించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ మంజూర్ చేస్తూ కొన్ని కండిషన్లు పెట్టారు..

    ఇదీ చదవండి : సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చి ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై.. ఏం జరిగిందంటే?

    అయితే నారాయణకు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా రాజకీయ దుమారం ఆగడం లేదు. ఆ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ కు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు కూడా రాశారు.. నారాయణను కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని.. ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరారు.. అయితే మంత్రులు మాత్రం నారాయణపై తమకు ఎందుకు కక్ష అని.. కేవలం పేపర్ల లీకేజ్ విషయంలో ఆయనకు సంబంధం ఉందని ఆధారాలు ఉండడంతోనే అరెస్ట్ చేశామని మంత్రులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి : : తుఫానులో కొట్టుకొచ్చిన బంగారు రథం మిస్టరీ వీడింది.. దీని వెనుకు ఇంత పెద్ద కథ ఉందా..?

    తాజాగా చిత్తూరు పోలీసులు మాత్రం నారాయణను వదిలి పెట్టేది లేదంటున్నారు. అందుకే నారాయణ బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఆయనకు పేపర్ లీకేజ్ వ్యవహారంతో సంబంధం ఉంది అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నారు చిత్తూరు పోలీసులు.. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP 10th Exams 2022, AP News, Narayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు