హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big shock: అధికార వైసీపీకి మరో షాక్ తప్పదా..? జనసేన వైపు ఆ కీలక నేత చూపు..

Big shock: అధికార వైసీపీకి మరో షాక్ తప్పదా..? జనసేన వైపు ఆ కీలక నేత చూపు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Big Shock to YCP: కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. చాలా జిల్లాల్లో పరిస్థితి అదే.. దీంతో ఇప్పటికే పార్టీపై అలక పూనిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నట్టు టార్గెట్..

ఇంకా చదవండి ...

టAP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ పరిణమాలు హీటు పెరుగుతోంది. అధికార పార్టీలో కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల విపక్షాలు పదే పదే చెబుతున్న మాట.. త్వరలో అధికార పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని.. ఆ మాటలు నిజం కాబోతున్నాయా..? మొన్నటి కేబినెట్ విస్తరణ, తాజాగా రాజ్యసభ పదవుల నియామకం.. అన్ని జిల్లాల్లో  అసమ్మతి నేతల లిస్టు పెరుగుతూ ఉంది. గతంలో సీఎం జగన్ (CM Jagan) ఆయా నేతలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవడంతో.. వారంతా ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా..? మరి ఆ వలసలు ఆపేందుకు వైసీపీ (YCP) అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందా.. లేక వారిని లైట్ తీసుకుంటోందా..? లేక సీఎం జగన్ ఆఫర్లు ఇచ్చినా.. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమే అని.. జంపింగ్ జపాంగ్ కి సిద్ధం అవుతున్నారా..?

తాజాగా ప్రకాశం జిల్లా (Prakasam District) లో ఓ బలమైన నేత జనసేన (Janasena)లో జాయిన్ అవుతున్నారంటూ ప్రచారం ఉంది. చీరాల నియోజకవర్గంలో ఆయన బలమైన నేత. ప్రధాన రాజకీయ పక్షాలకు దీటుగా నిలబడి ఎమ్మెల్యేగా పోటీచేసి ఇండిపెండెంట్ గా గెలిచిన రికార్డు కూడా ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు.


ప్రస్తుతం చీరాలలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన జనసేనలో చేరాలని నిశ్చయించుకున్నారనే ప్రచారం ఉంది. మరి అధికార వైసీపీ ఆయన్ను వదులుకునేందుకు సిద్ధంగా ఉందా..? ఎలాగైనా ఆయనకు ఎక్కడో ఒక దగ్గర సీటు సర్దుబాటు చేసేందుకు అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారుని టాక్ ఉంది.  ఆ మధ్య  తన తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని..మరోసీటు ఆఫర్ చేశారని వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆయన మాత్రం చీరాల కోసమే పట్టుపడుతున్నారంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో లాంటి కీలక వ్యక్తులు పార్టీ మారితే.. రాష్ట్ర వ్యాప్తంగా వేరే రకమైన సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.

ఇదీ చదవండి : కుట్రలను ప్రజలే తిప్పి కొడతారు.. అధికారం సాధ్యంకాదని చంద్రబాబుకు తెలిసిపోయిందన్న సజ్జల

గత ఎన్నికల్లో చీరాల నుంచి ఆయన పోటీ చేసి ప్రత్యర్థి చేతిలో ఓడారు. అదే సమయంలో వేరే పార్టీ నుంచి గెలిచిన నేత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో చీరాల సీటు వచ్చే ఎన్నికల్లో తనదే అని హామీ ఇవ్వడంతోనే వైసీపీ కండువా కప్పుకున్నారని తెలుస్తోంది. మరోసారి ఇటీవల సీఎం జగన్ ఆయనకు స్పష్టమైన హామీ కూడా ఇచ్చారట.. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు.. చీరాలే కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు. దీంతో ఎవరో ఒకరికి.. మరోదగ్గర సీటు కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉంది. కానీ ఆ సర్దుబాటుకు ఇద్దరూ సిద్ధంగా లేదు.. దీంతో కచ్చితంగా ఎవరో ఒకర్ని పార్టీ వదులుకునే పరిస్థితి ఏర్డింది.

First published:

Tags: Amanchi krishna mohan, Andhra, Andhra Pradesh, Ap, AP News, AP Politics, Prakasam

ఉత్తమ కథలు