హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Corruption: డిప్యూటీ సీఎం ఇలాకాలో అవినీతి చేప.. చేయి తడిపితేేనా ఏ పనైనా..?

Corruption: డిప్యూటీ సీఎం ఇలాకాలో అవినీతి చేప.. చేయి తడిపితేేనా ఏ పనైనా..?

ఏసీబీ దాడులతో అవినీతి అధికారులకు దడ

ఏసీబీ దాడులతో అవినీతి అధికారులకు దడ

Corruption: లంచాలు తీసుకుంటూ గతంలో అనేక మార్లు‌ పట్టుబడినా.. కొందరి తహసీల్దారుల్లో మార్పు కనిపిండం లేదు. పదేపదే అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇలాకాలో అవినీతి తహసీల్దార్ బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

GT Hemanth Kumar, Tirupathi, News18

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Deputy CM Narayana Swamy) ఇలాకాలో మరో అవినీతి  తాహసీల్దార్ వ్యవహారం  వెలుగులోకి వచ్చింది. మొన్న పెనుమూరు (Penamuru) కు చెందిన తహసీల్దార్ రమణీ వ్యవహారం, నేడు ఎస్.ఆర్.పురం తహసీల్దార్ అవినీతి (Corrupted MRO) అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ గతంలో అనేక మార్లు‌ పట్టుబడినా ఆ తహసీల్దార్ తీరు మార్చుకోవడం లేదు. ఎస్.ఆర్.పురం తాహసీల్దార్ షబ్బీర్ భాష వేధింపులు తట్టుకోలేక అధికార పార్టికి చెందిన ఓ సర్పంచ్ ఏకంగా జిల్లా కలెక్టర్ హరినారాయణకు ఫిర్యాదు చేసాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్.ఆర్.పురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరిపి జిల్లా కలెక్టర్ (District Collector) హరినారాయణకు నివేదిక పంపారు. అసలు తహసీల్దార్ కార్యాలయానికి  వచ్చే వారిపై ఎస్.ఆర్.పురం తహసీల్దార్ షబ్బీర్ భాష చాలా దారుణంగా ప్రవర్తించేవారని ప్రచారం ఉంది.

చిత్తూరు జిల్లా (Chittoor District) గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రెవెన్యూ అధికారుల అవినితి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉమ్మడి జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. తహసీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజల నుండి నగదు ముట్టనిదే పని చేయనని చెప్పావరంట.. అంతేకాదు నగదు ఇవ్వక పోతే కార్యాలయంకు వచ్చిన వారిపై దుర్భాషలాడుతూ రెచ్చి పోయే వారని స్థానికులు చెబుతున్నారు.

ప్రజలైనా, అధికార‌ పార్టి నాయకుడైనా ఎవరైనా సరే.. తనకు నగదు మూట చేతిలో పెట్టాల్సిందే అన్నది ఆ తహసీల్దారు పాలసీ అంటున్నారు. ఎస్.ఆర్.పురం మండల‌ కేంద్రంలో తాహసీల్దార్ గా భాధ్యతలు చేపట్టిన షబ్బీర్ భాషా మొదట ప్రజలు సేవలందిస్తూ.. ఓ మంచి అధికారిగా ప్రజల నుండి మెప్పు పొందుతూ వచ్చేవారు.

ఇదీ చదవండి : ఒకప్పటి స్టార్ హీరోయిన్.. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు.. ముద్దుగా ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా..?

అదే స్టైల్‌లో అధికార పార్టి నాయకులు దగ్గర  సైతం తానోక నిజాయితీ అధికారిని నంటూ కలరింగ్ ఇచ్చేవారు. తన కార్యాలయంలో ఇద్దరు విఆర్వోలను పక్కన పెట్టుకుని పనికి తగ్గట్టుగా లంచం లాగేవాడు.. అంతే కాకుండా ప్రభుత్వ భూములను గుర్తించి నగదు ఇచ్చిన వారికి ఆ భూములను అప్పనంగా కట్ట బెట్టేవాడు.. రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చకుని అక్రమాలకు పాల్పడేవాడు.. ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఒక్క ఛాన్స్.. సెకెండ్ ఛాన్స్.. లాస్ట్ ఛాన్స్.. మీ ఓటు ఎవరికి..? 2024 ఎన్నికల నినాదం ఇదే

ఇదేంటని ప్రశ్నించిన వారిపై అసహ్యకరమైన పధజాలాన్ని ఉపయోగిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. రోజు రోజుకి  అతని ఆగడాలు మితి మీరుతున్న తహసీల్దార్ షబ్బీర్ భాషా ఆగడాలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భావించిన స్ధానిక అధికార పార్టి సర్పంచ్ ఢిల్లియ్య.. అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా కలిసి.. ఈ నెల తొమ్మిదో తేదీన జిల్లా కలెక్టర్ హరినారాయణను కలిసి.. తహసీల్దారు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి : కూతురు సినీ ఎంట్రీపై రోజా క్లారిటీ.. శత్రువులను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని శ్రీవారిని మొక్కుకున్న మంత్రి

దీనిపై సిరియస్ అయ్యిన కలెక్టర్ హరినారాయణ విచారణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లలను ఆదేశించారు.. కలెక్టర్ ఆదేశాలతో ఎస్.ఆర్.పురం తాహసిల్దార్ కార్యాలయంకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కార్యాలయంలోని రికార్డులను‌ పరిశీలించి విచారణ చేపట్టి.. షబ్బీర్ భాషాతో పాటు ,మరో ఇద్దరూ విఆర్వోలు అక్రమాలు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో షబ్బీర్ భాషాపై ఓ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్ హరినారాయణకు నివేదిక‌ పంపారు. ఈ నివేదిక పరిశీలించిన తరువాత జిల్లా కలెక్టర్ తాహసిల్దార్ షబ్బీర్ భాషాపై శాఖా పరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: ACB, Andhra Pradesh, AP News, Chittoor, Crime news

ఉత్తమ కథలు