P Anand Mohan, News18, Visakhapatnam
MLC Ananta Babu: ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantababu).. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అతడి గురించి తెలియని వారు ఉండరేమో.. అందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. దళితుడైన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీనే స్వయంగా హత్య చేశాడనే ( Murder Case) ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు ఆయనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడనే ప్రచారం ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం అతడిపై వేటు వేసిందని.. అరెస్ట్ చేయించింది అన్నది రాజకీయ వర్గాల టాక్.. అయితే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.. జైల్లో ఉన్నారు.. ఇదంత పేరుకే.. ఆయన జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారని.. తరచూ ములాకత్ లలో పాల్గొంటున్నారని విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా మరో వివాదానికి ఆయన కారణం అయ్యారు.. ప్రమేయం లేకుండానే..? ఇంతకీ ఏం జరిగింది అంటే..?
రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) తీరే ఈ వివాదానికి కారణం. ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారంలో మొదటి నుంచి ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె చేసిన పని.. ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. అల్లూరి జిల్లా అడ్డతీగలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు... అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏం చేశారంటే..?
ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఫ్లెక్సీతో గ్రామంలో ఉరేగింపు నిర్వహించారు. అక్కడితోనే ఆగలేదు.. పూలాభిషేకం చేశారు. డీజేలతో హోరెత్తించారు. చిన్నారులతో జై బాబు.. జైజై బాబు అంటూ నినాదాలు చేయించారు. ఈ వ్యవహారం మొత్తం కూడా వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి (Nagulapalli Dhanalaxmi) ఆధ్వర్యంలోనే జరిగింది.
ఇదీ చదవండి : అమెరికా అమ్మాయికి తెలుగు సంప్రదాయంలో ఘనంగా వివాహం.. ఎక్కడ అంటే?
గడపగడపకు మన ప్రభుత్వం అనేది ఓ అధికారిక కార్యక్రమం. ఇందులో ఓ నిందితుడి ఫోటోను ఊరేగించడం ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది. అసలు ప్రభుత్వ కార్యక్రమంలో హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫోటో ఎలా పెడతారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి : కర్మఫలం అనుభవించక తప్పదు.. రాహుల్‌పై విజయ సాయిరెడ్డి సెటైర్లు
మరోవైపు అనంతబాబు అక్రమాలు ఒక్కక్కటిగా బయటకు వస్తున్నాయి. కాకినాడలో, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనంతబాబు వ్యవహారాలు ఎన్నో బయట పడ్డాయి. దీంతో ఒకదశలో అనంతబాబు పేరు ఎత్తాలంటేనే కొందరు వైసీపీ నేతలు భయపడిపోయారు. కానీ అనంతబాబుతో కొందరు పార్టీ నేతలు మాత్రం ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారు.
ఇప్పుడు తాజాగా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి ఫ్లెక్సీలతో.. ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేపట్టడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొత్త అనుమానాలు రేెకెత్తుతున్నాయి. ఆయన్ను నిజంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారా..? లేక ఆయన ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారంటూ కొత్త చర్చ మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics