Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్ళాయి. యాత్రలు, సభలు, సమీక్షలు, సమావేశాల పేరుతో ఆయా పార్టీల నేతలు బిజీ బిజీగా మారారు. సంవత్సర కాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో ఆయా పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలు నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలలో ఉంటున్నారు. అదీగాక టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుధీర్ఘ పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరో వైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్టీ ప్రచారరధం "వారాహి" లో రాష్ట్రం మొత్తం చుట్టెయ్యడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తుల విషయంలో బెట్టు చేస్తున్న బీజేపీని పక్కన పెట్టి.. టీడీపీ-జనసేన లు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అధికార వైసీపీ వ్యూహం మరోలా ఉంది. గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ తన పార్టీ.. ఎమ్మెల్యేలు ఇంఛార్జ్ లను ప్రతి ఇంటికి తిరిగి తామ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను తెలియ పరిచే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నెల నెలా వర్క్ షాప్ నిర్వహించి మరీ పార్టీ నాయకులకు జగన్ దిశానిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్రంలో 89% మంది ప్రజలు తమ ప్రభుత్వం నుంచి సహాయం పొందారని.. వారందరి ఓట్లు మనకేనని గడప గడప కి కార్యక్రమం సజావుగా నిర్వహిస్తే మొత్తం 175 స్థానాలు మనవే నని ఆయన దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఈ పథకాలే తమకు రెండో సారి అధికారం కట్టపెడతాయని సీఎం ధీమాగా ఉన్నారు.
ఇదీ చదవండి : తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్వాలు.. 24 గంటల్లో ఏడు వాహన సేవలు.. ప్రత్యేకత ఏంటంటే?
కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. మౌళిక వసతుల కల్పనపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు నాయకుల దగ్గర సమాధానం లేదు. అభివృద్ధికి సంబంధించిన ఊసేలేదని ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానమూ లేదు. ఆర్ధిక సమస్యల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రణాళికలూ లేవు. రోజు రోజుకి పెరుగుతున్న నిత్యవసర సరకుల ధరలు, డీజిల్ పెట్రోల్ భారం, భారీగా పెరిగి పోయిన విధ్యుత్ బిల్లులు లాంటి అంశాలు ప్రజలలలో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతను కలిగిస్తుంది.
ఇదీ చదవండి: టీడీపీలో కేశినేని టెన్షన్.. ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటారో అనే భయం.. అసలు ప్లాన్ ఏంటి..?
దీనికి తోడు సి.పి.ఎస్ రద్దు, మద్యపాన నిషేదం, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులలో జాప్యం, సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని ఆర్ధిక దుస్థితి తదితర అంశాలు ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి అనే ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు సీటు ఫిక్స్.. దొంగ ఓట్లపై వైసీపీ అలర్ట్
గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి ఆయా నేతలకు నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. ఐతే చాలా మటుకు ఇలాంటి నిరసనలు బయటికి తెలియకుండా ఆయా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వైపు అధికారపార్టీలో వర్గ పోరు, అసమ్మతులు, అవినీతి వంటి అంశాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.
ఇదీ చదవండి : గంటా రీ ఎంట్రీతో అయ్యన్న ఫైర్.. ఎవడయ్యా గంటా.. లక్షల్లో ఒక్కడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు
ఒక వైపు ప్రతిపక్షాలు ఈ సారి ఎలాగైనా అధికార పీఠం ఎక్కాలని తమ పని తాము చసుకుంటూ పోతున్నాయి. అధికార వైసీపీ మాత్రం పథకాల ద్వారా తాము పంచిన డబ్బులు తమ ని ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గట్టెక్కిస్తాయని బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ది గురించి ప్రశ్నిస్తే మాత్రం ప్రతిపక్షాల పై విరుచుకు పడుతూ భయ భ్రాంతులకు గురిచేస్తున్నారంటూ విమర్శలు లేక పోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ycp